AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siddharth: ఎయిర్‏పోర్ట్ సిబ్బందిపై సంచలన కామెంట్స్ చేసిన హీరో సిద్ధార్థ్.. తల్లిదండ్రులతో కలిసి వస్తుంటే వేధించారంటూ..

తాజాగా మధురై ఎయిర్ పోర్ట్ సిబ్బంది పై షాకింగ్ కామెంట్స్ చేశారు సిద్ధూ. తన తల్లిదండ్రులతో కలిసి వస్తుంటే తనను వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్ట్ సిబ్బంది ప్రవర్తన గురించి ఇన్ స్టాలో సుధీర్ఘ పోస్ట్ చేశారు.

Siddharth: ఎయిర్‏పోర్ట్ సిబ్బందిపై సంచలన కామెంట్స్ చేసిన హీరో సిద్ధార్థ్.. తల్లిదండ్రులతో కలిసి వస్తుంటే వేధించారంటూ..
Siddarth
Rajitha Chanti
|

Updated on: Dec 28, 2022 | 7:09 AM

Share

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఒకప్పుడు లవర్‏బాయ్‏గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు సిద్ధార్థ్. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని.. ఆ తర్వాత ఎన్నో ప్రేమకథలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. తెలుగులో బొమ్మరిల్లు, నువ్వోస్తానంటే నేనొద్దంటానా వంటి చిత్రాలతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇక మహాసముద్రం సినిమా తర్వాత మరో సినిమాలో కనిపించలేదు సిద్ధూ. కానీ గత కొద్ది రోజులుగా ఈ హీరో నిత్యం సోషల్ మీడియాలో నిలుస్తున్నాడు. ముఖ్యంగా హీరోయిన్ అదిథి రావు హైదరీతో సిద్ధూ ప్రేమాయణం ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అందుకు తగినట్టుగానే వీరిద్దరు కలిసి ఇటీవల ముంబైలోని ఓ రెస్టారెంట్ కనిపించడంతో వీరి ప్రేమలో ఉన్నారనే వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక తాజాగా మధురై ఎయిర్ పోర్ట్ సిబ్బంది పై షాకింగ్ కామెంట్స్ చేశారు సిద్ధూ. తన తల్లిదండ్రులతో కలిసి వస్తుంటే తనను వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్ట్ సిబ్బంది ప్రవర్తన గురించి ఇన్ స్టాలో సుధీర్ఘ పోస్ట్ చేశారు.

డిసెంబర్ 27న మంగళవారం తన తల్లిదండ్రులతో కలిసి వస్తున్నప్పుడు మధురై విమానాశ్రయంలోని సీఆర్పీఎఫ్ సిబ్బంది వేధించారని తెలిపారు. అంతేకాకుండా.. అధికారులు పదే పదే హిందీలో మాట్లాడుతున్నారని.. ఇంగ్లీష్ లో మాట్లాడాలని కోరినా పట్టించుకోలేదని అన్నారు. అలాగే సిబ్బంది తన తల్లిదండ్రులను వారి బ్యాగ్స్ నుంచి నాణేలను తొలగించేలా చేశారని.. దీని గురించి ప్రశ్నిస్తే ఇండియాలో ఇలాగే ఉంటుందని బదులిచ్చారు అంటూ చెప్పుకొచ్చారు. సిద్ధార్థ్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుంది.

Siddharth

Siddharth

తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సిద్ధూ.. గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఈ హీరో డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ మూవీలో కాజల్ కథానాయికగా కనిపించనుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..