Sushant Singh Rajput: ‘సుశాంత్ సింగ్ కళ్లపై కొట్టారు.. గొంతు కోసి దారుణంగా చంపారు’.. మరోసారి రూప్‏కుమార్ షా షాకింగ్ కామెంట్స్..

సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని. ఆయనది హత్యేనని రూప్ కుమార్ షా అన్నారు. అతడి శరీరం మెడపై అనేక గుర్తులు ఉన్నాయని.. పోస్ట్ మార్టం చేసేటప్పుడు వీడియో తీయాలని.. కానీ ఫోటోస్ మాత్రమే తీయాలని ఉన్నతాధికారులు హెచ్చరించారని తెలిపారు. తాజాగా మరిన్ని విషయాలను బయటపెట్టారు.

Sushant Singh Rajput: 'సుశాంత్ సింగ్ కళ్లపై కొట్టారు.. గొంతు కోసి దారుణంగా చంపారు'.. మరోసారి రూప్‏కుమార్ షా షాకింగ్ కామెంట్స్..
Sushant Singh Rajput
Follow us

|

Updated on: Dec 28, 2022 | 7:34 AM

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఇప్పటికీ వీడని మిస్టరీ. అధికారులు.. పోలీసులు ఆ హీరోది ఆత్మహత్య అని ప్రకటిస్తే.. అభిమానులు మాత్రం హత్యే అంటూ వాదిస్తున్నారు. దీంతో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు సీబీఐ చేతికి వెళ్లింది. అతడు చనిపోయి రెండేళ్లు దాటినా.. మృతి వెనకున్న స్పష్టమైన కారణాలు మాత్రం ఇప్పటివరకూ తెలియరాలేదు. అయితే ఇటీవల సుశాంత్ కు పోస్ట్ మార్టం చేసిన బృందంలోని ఓ వ్యక్తి సంచలన విషయాలను బయటపెట్టారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని. ఆయనది హత్యేనని రూప్ కుమార్ షా అన్నారు. అతడి శరీరం మెడపై అనేక గుర్తులు ఉన్నాయని.. పోస్ట్ మార్టం చేసేటప్పుడు వీడియో తీయాలని.. కానీ ఫోటోస్ మాత్రమే తీయాలని ఉన్నతాధికారులు హెచ్చరించారని తెలిపారు. తాజాగా మరిన్ని విషయాలను బయటపెట్టారు. సుశాంత్ కళ్లపై గట్టిగా కొట్టారని.. అలాగే అతడిని గొంతు కోసి చంపారని అన్నారు.

ఇటీవల ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షా మాట్లాడుతూ.. ” సుశాంత్ శరీరంపై అనేక గాయాలున్నాయి. అతని ఎముకలు కూడా విరిగిపోయాయి. నేను నా సీనియర్లకు చెప్పడానికి ప్రయత్నించాను. కానీ వారు వినలేదు. నా సొంత పని నన్ను చేసుకోమని హెచ్చారించారు. నేను పోస్ట్ మార్టం చేసే బృందంలో ఒక సభ్యుడిని మాత్రమే. ఆ రోజు మా టీం హెడ్ గా ఎవరున్నారనేది నేను మర్చిపోయాను. హీరో మెడపై ఉన్న గుర్తులు వేలాడదీయడం కాదు.. అతని గొంతు కోసి చంపినట్లు కనిపించాయి. ” అని అన్నారు.

ఇక ఇదే విషయాన్ని 2020లోనే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించగా.. ఘటన జరిగినప్పుడు నెలకొన్న పరిస్థితులు.. అప్పటి ప్రభుత్వాన్ని నమ్మి నాకు చెప్పాలేకపోయాను. ఇప్పుడు ఏజెన్సీల ముందు నా స్టేట్ మెంట్ రికార్డ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా భద్రత గురించి నేను పట్టించుకోను. కానీ సుశాంత్ కు న్యాయం చేయాలి. అని అన్నారు. సుశాంత్ శరీరాన్ని అతని కుటుంబసభ్యులకు సరిగ్గా చూపించలేదని.. అలాగే అతని ఆత్మహత్య అని వస్తున్న వార్తలలో నిజంలేదని అన్నారు.