AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sidharth- Shehnaaz: ‘దూరం మనుషులకే.. మనసులకు కాదుగా’.. షెహనాజ్ ఫోన్ వాల్ పేపర్‏గా సిద్ధార్థ్ శుక్లా..

హౌస్ లో ఉన్న సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం తర్వాత ప్రేమగా మారింది. గతేడాది వీరిద్దరు తమ ప్రేమ బంధాన్ని.. పెళ్లితో ఒక్కటి కావాలనుకున్నట్లుగా బీటౌన్ లో వార్తలు వినిపించాయి. కానీ అంతలోనే సిద్ధార్థ్ అకాల మరణంతో అభిమానులు షాకయ్యారు. సిద్ధూ మృతి చెందిన తర్వాత షెహనాజ్ కొద్ది రోజులు డిప్రెషన్‏లో వెళ్లింది.

Sidharth- Shehnaaz: 'దూరం మనుషులకే.. మనసులకు కాదుగా'.. షెహనాజ్ ఫోన్ వాల్ పేపర్‏గా సిద్ధార్థ్ శుక్లా..
Sidharth Shukla,shehnaaz Gi
Rajitha Chanti
|

Updated on: Dec 28, 2022 | 8:18 AM

Share

దివంగత నటుడు సిద్ధార్థ్ శుక్లా మరణించి ఏడాది గడిచిపోయింది. కానీ ఇప్పటికీ అతడి మృతిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫిట్ నెస్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సిద్ధార్థ్.. ఆకస్మాత్తుగా గతేడాది సెప్టెంబర్ 2న గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే. బాలిక వధు.. తెలుగులో చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా దక్షిణాదిలోనూ ఫాలోయింగ్ సంపాదించుకున్న సిద్ధూ.. హిందీ బిగ్ బాస్ 13 విజేతగా నిలిచాడు. ఈ రియాల్టీ షో అనంతరం సిద్ధూ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అంతేకాకుండా అతడికి బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రభాస్ నటిస్తోన్న ఆదిపురుష్ సినిమా నుంచి కూడా తనకు ఆఫర్ వచ్చిందని గతంలో టాక్ వినిపించగా.. వాటిలో నిజం లేదని కొట్టిపారేశారు సిద్ధూ. ఇక బిగ్ బాస్ షోలో సిద్ధార్థ్.. షెహనాజ్ జోడికి వీరాభిమానులున్నారు. హౌస్ లో ఉన్న సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం తర్వాత ప్రేమగా మారింది. గతేడాది వీరిద్దరు తమ ప్రేమ బంధాన్ని.. పెళ్లితో ఒక్కటి కావాలనుకున్నట్లుగా బీటౌన్ లో వార్తలు వినిపించాయి. కానీ అంతలోనే సిద్ధార్థ్ అకాల మరణంతో అభిమానులు షాకయ్యారు. సిద్ధూ మృతి చెందిన తర్వాత షెహనాజ్ కొద్ది రోజులు డిప్రెషన్‏లో వెళ్లింది. ఇక ఇప్పుడిప్పుడే తిరిగి సోషల్ మీడియాలో యాక్టివ్ కాగా.. బుల్లితెరపై సందడి చేస్తోంది.

అయితే ఇటీవల ఇండియన్ ఐడల్ 13 షోలో పాల్గొన్న షెహనాజ్ సెట్స్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు ఆమె కారులో కూర్చుండగా.. ఫోన్ వాల్ పేపర్ గా సిద్ధార్థ్ ఫోటో కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. దీంతో షెహనాజ్ సిద్ధార్థ్ ను మర్చిపోయిందని.. తను మరొకరితో డేటింగ్ లో ఉందంటూ వస్తున్న వార్తలకు చెక్ పడింది. మరోవైపు షెహనాజ్ ఫోన్ వాల్ పేపర్ గా సిద్ధూ పిక్ ఉండడం చూసి అభిమానులు ఎమోషనల్ అయ్యారు. ఆమెకు మద్దతు తెలుపుతూ.. స్టే స్ట్రాంగ్ సనా.. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము.. మీరు అందంగా ఉన్నారు.. మీరు ధైర్యవంతులు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇక తన పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది షెహనాజ్. అందులో ఉన్న ఓ కేక్ పై సిద్ అంటూ పేరు కనిపించింది. అలాగే నేను నిన్ను మళ్లీ కలుస్తాను.. అంటూ రాసుకొచ్చింది. షెహనాజ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలయ్యాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా