AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Waltair Veerayya: యూట్యూబ్‏ను అల్లాడించేసిన వాల్తేరు వీరయ్య.. మరోసారి అదరగొట్టిన బాస్..

చాలా కాలం తర్వాత ఫుల్ మాస్ అవతారంలో మెగా అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వునున్నారు చిరు. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ఇక మాస్ మాహారాజా రవితేజ కీలకపాత్రలో కనిపించనుండడంతో ఈ మూవీపై భారీగానే అంచనాలు ఉన్నాయి.

Waltair Veerayya: యూట్యూబ్‏ను అల్లాడించేసిన వాల్తేరు వీరయ్య.. మరోసారి అదరగొట్టిన బాస్..
Megastar Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Dec 28, 2022 | 6:45 AM

Share

డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం వాల్తేరు వీరయ్య.. ఇటీవలే గాడ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న చిరు.. ఇప్పుడు మరోసారి థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడానికి సిద్ధమయ్యారు. చాలా కాలం తర్వాత ఫుల్ మాస్ అవతారంలో మెగా అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వునున్నారు చిరు. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ఇక మాస్ మాహారాజా రవితేజ కీలకపాత్రలో కనిపించనుండడంతో ఈ మూవీపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా డిసెంబర్ 26న విడుదలైన వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ యూట్యూబ్‏ను షేక్ చేస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే 7 మిలియన్ కు పై వ్యూస్ రాబట్టి సంచలనం సృష్టింది. ఆల్బమ్‌లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి ఇప్పటికే చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ట్రాక్ అన్ని రికార్డులను బద్దలు కొడుతుంది.

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మాస్ యాక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై మెగా అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో చిత్రం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రయూనిట్. డిసెంబర్ 27న నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆసక్తికర కామెంట్స్ చేశారు చిరు.

ఈ సినిమాలో తనను బాబీ ఉహించని విధంగా చూపించాడని.. ఈ సినిమా కోసం అందరూ ప్రేమను పంచారని అన్నారు. ఈ సినిమాకు క్లాస్ కు క్లాస్, మాస్ కు మాస్ చాలా అద్భుతమైన పాటలిచ్చారు దేవి శ్రీ ప్రసాద్ అన్నారు చిరు. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ భోళా శంకర్ మూవీ చిత్రీకరణలో బిజీ కానున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..