Sushant Singh Rajput’s death: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హత్యా ఆరోపణలపై రియా చక్రవర్తి రియాక్షన్.. ఏమన్నారంటే..

సుశాంత్ శరీరంపై అనేక గాయాలున్నాయని.. అతడిని కళ్లపై కొట్టి.. గొంతు కోసి చంపారని.. కానీ ఈ విషయం అప్పుడే తన సీనియర్లకు చెబితే వారు వినిపించుకోలేదని.. పోస్ట్ మార్టం చేసే సమయంలో వీడియో కాకుండా..

Sushant Singh Rajput's death: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హత్యా ఆరోపణలపై రియా చక్రవర్తి రియాక్షన్.. ఏమన్నారంటే..
Sushant Singh Rajput, Rhea
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 29, 2022 | 7:31 AM

దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ మిస్టరీ మళ్లీ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అతను ఆత్మహత్య చేసుకోలేదని.. హత్య చేశారని సుశాంత్ ను పోస్ట్ మార్టం చేసిన బృందంలోని సభ్యుడు రూప్ కుమార్ షా ఆరోపించారు. ఆయన మరణం ఇప్పటికీ వీడని చిక్కుమూడి. సుశాంత్ ది హత్యే అంటూ అభిమానులు.. కుటుంబసభ్యులు ముందు నుంచి వాదిస్తుండగా.. ఆత్మహత్య అంటూ అధికారులు తెల్చీ చెప్పారు. దీంతో ఈ కేసు టేకప్ చేసిన సీబీఐ గత రెండేళ్లుగా దర్యాప్తు జరుపుతుంది. ఈ క్రమంలోనే కూపర్ హాస్పిటల్ సిబ్బందిలోని రూప్ కుమార్ షా సుశాంత్ ది ఆత్మహత్య కాదని. హత్యే అని సంచలన విషయాలను బయటపెట్టారు. సుశాంత్ శరీరంపై అనేక గాయాలున్నాయని.. అతడిని కళ్లపై కొట్టి.. గొంతు కోసి చంపారని.. కానీ ఈ విషయం అప్పుడే తన సీనియర్లకు చెబితే వారు వినిపించుకోలేదని.. పోస్ట్ మార్టం చేసే సమయంలో వీడియో కాకుండా.. కేవలం ఫోటోస్ మాత్రమే తీశారని.. ప్రస్తుతం సుశాంత్ కు న్యాయం జరగాలని అన్నారు షా. ఈ క్రమంలోనే సుశాంత్ మాజీ ప్రేయసి.. రియా చక్రవర్తి తన ఇన్ స్టాలో ఆసక్తికర పోస్టట్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

“మీరు అగ్ని గుండాలపై నడిచారు.. వరదలను తట్టుకుని.. రాక్షసులపై విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి మీ సొంత శక్తిని నమ్ముకొని ముందుకు సాగండి” అంటూ పోస్ట్ చేసింది రియా. గతంలో సుశాంత్ ఆత్మహత్య కేసులో రియా జైలు శిక్ష అనుభవించి బెయిల్ పై విడుదలైంది. అతడికి డ్రగ్స్ ఇచ్చి ఆత్మహత్యకు ప్రేరెపించినట్లుగా రియా ఆరోపణలు ఎదుర్కొంది. జైలు నుంచి విడుదలైన తర్వాత రియా సోషల్ మీడియాలో అనేక నెగిటివిటిని ఎదుర్కొంది. రియా తెలుగులో తునీగ తునీగ సినిమాతో వెండితెరపై అలరించింది.

ఇవి కూడా చదవండి
Sushant Singh Rajput

Sushant Singh Rajput

ఇక మరోవైపు సుశాంత్ ది హత్యా అని వాదిస్తున్న షా.. ఆయన శరీరంపై అనేక గుర్తులు ఉన్నాయని.. మెడపై రెండు నుంచి మూడు గుర్తులు కూడా ఉన్నాయని.. పోస్ట్ మార్టం రికార్డ్ చేయాల్సి ఉండగా.. కేవలం ఫోటోస్ మాత్రమే తీయాలని ఉన్నతాధికారులను కోరారు. అప్పుడు ప్రభుత్వం.. పరిస్థితులను చూసి ఈ నిజాలను బయటపెట్టలేదని అన్నారు.