AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pathaan: షారుక్ ఖాన్ సినిమాకు సెన్సార్ బోర్డు షాక్.. దీపికా అందాల ఆరబోతపై అభ్యంతరం

హీరోగా షారుక్ సినిమా చేసి చాలా కాలం అయ్యింది. చివరిగా షారుక్ నటిస్తోన్న సినిమా జీరో. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. ఆ తర్వాత షారుక్ చాలా గ్యాప్ తీసుకున్నారు.

Pathaan: షారుక్ ఖాన్ సినిమాకు సెన్సార్ బోర్డు షాక్.. దీపికా అందాల ఆరబోతపై అభ్యంతరం
Pathaan
Rajeev Rayala
|

Updated on: Dec 29, 2022 | 6:29 PM

Share

బాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసిన వినిపిస్తున్న పేరు పఠాన్. షారుక్ ఖాన్ నటిస్తున్న ఈ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హీరోగా షారుక్ సినిమా చేసి చాలా కాలం అయ్యింది. చివరిగా షారుక్ నటిస్తోన్న సినిమా జీరో. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. ఆ తర్వాత షారుక్ చాలా గ్యాప్ తీసుకున్నారు. మధ్యలో ఒకటి రెండు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు. ఇక వచ్చే ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు షారుక్. వాటిలో పఠాన్ సినిమా ఒకటి . యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీకి సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో దీపికా పడుకోన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కాగా ఈ మూవీ బేషరమ్ సాంగ్ వివాదాలకు కారణమైన విషయం తెలిసిందే.

ఈ సాంగ్ లో బికినిలో రెచ్చిపోయింది దీపికా. దాంతో పలు అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అలాగే దీపికా కాషాయం రంగు బికినీ ధరించడంతో బీజీపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో ఈ మూవీ బాయ్ కాట్ చేయాలంటూ ప్రచారం జరిగింది. తాజాగా పఠాన్ సినిమాకు సెన్సార్ బోర్డు కూడా షాక్ ఇచ్చిందని తెలుస్తోంది.

దీపిక బికినీ సహా పాటలో ఆమె అందాల ఆరబోత పై అభ్యంతరం వ్యక్తం చేసింది. పాటలో మార్పులు చేయాలని సెన్సార్ బోర్డ్ మేకర్స్ని కోరింది.  కచ్చితంగా సెన్సార్ నిబంధలను పాటించి తీరాలని ఆదేశాలిచ్చింది. దాంతో ఈ పాటలో మార్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ వ్యవహారం పై ఇప్పటికైనా చిత్రయూనిట్ స్పందిస్తుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!