AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అవతార్‌ 2: ది వే ఆఫ్ వాటర్ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే రెండో మువీగా గుర్తింపు..

విజువల్‌ వండర్‌ అవతార్‌-2 ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టి ‘అవతార్‌2’ (Avatar2: The Way Of Water) విడుదలైన మొదటి రోజు నుంచే..

అవతార్‌ 2: ది వే ఆఫ్ వాటర్ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే రెండో మువీగా గుర్తింపు..
Avatar 2 The Way Of Water
Srilakshmi C
|

Updated on: Dec 29, 2022 | 2:45 PM

Share

విజువల్‌ వండర్‌ అవతార్‌-2 ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టి ‘అవతార్‌2’ (Avatar2: The Way Of Water) విడుదలైన మొదటి రోజు నుంచే కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై నేటికి సరిగ్గా 14 రోజులు అవుతోంది. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో తక్కువ రోజుల్లో గ్లోబల్‌ టికెట్‌ విక్రయాల్లో 1 బిలియన్‌ డాలర్ మార్కు దాటింది. 2022లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మువీల్లో కేవలం 3 సినిమాలు మాత్రమే బిలియన్‌ డాలర్‌ మార్కు చేరుకున్నాయి. మిగతా రెండు మువీలు ఏవంటే.. ‘టాప్ గన్: మావెరిక్’ మువీ (31 రోజుల్లో బిలియన్‌ మార్కుకు చేరుకుంది), ‘జురాసిక్ వరల్డ్ డొమినియన్’ (నాలుగు నెలలకు పైగా సమయం పట్టింది). ఇక 2019లో 9 సినిమాలు బిలియన్‌ డాలర్లను అధిగమించాయి. 2021లో విడుదలైన ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’ మువీ తొలిసారిగా కేవలం 12 రోజుల వ్యవధిలో బిలియన్‌ డాలర్‌ మార్కును కొట్టేసింది. తర్వాత ‘అవతార్‌ 2: ది వే ఆఫ్ వాటర్’ మువీ మాత్రమే విదుదలైన 14 రోజుల్లో 1 బిలియన్‌ డాలర్‌ మార్క్‌ను వేగంగా దాటింది. ప్రపంచ సినీ చరిత్రలో విడుదలైన రెండు వారాల్లో ఈ విధంగా కేవలం 6 సినిమాలు మాత్రమే వేగంగా బిలియన్‌ డాలర్‌ మార్క్‌ను సొంతం చేసుకున్నాయి.

కాగా జేమ్స్ కామెరూన్ 2009లో చిత్రీకరించిన ‘అవతార్’ మువీకి సీక్వెల్‌గా అవతార్‌ 2ను తెరకెక్కించిన విషయం తెలిసిందే. అవతార్‌ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ వద్ద 2.97 బిలియన్‌ డాలర్లతో ఆల్ టైమ్ టాప్ గ్రాసర్‌గా మిగిలిపోయింది. అదే ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో మువీ ‘జురాసిక్ వరల్డ్ డొమినియన్’. ప్రస్తుతం కరోనా మహమ్మారి మరోమారు విజృంభిస్తున్న నేపథ్యంలో అవతార్‌ 2 ఆశించినమేర ఆదాయం రాబట్టలేకపోవచ్చు. ప్రధాన థియేట్రికల్ మార్కెట్లు అయిన చైనా, రష్యాలలో భిన్న పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి