AP Police Constable Jobs: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! కానిస్టేబుల్‌, ఎస్సై పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకంటే..

ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌, ఎస్సై పోస్టులకు దరఖాస్తు గడువును పెంపొగిస్తూ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బుధవారం ప్రకటన విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన..

AP Police Constable Jobs: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! కానిస్టేబుల్‌, ఎస్సై పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకంటే..
AP Police Constable Recruitment 2022
Follow us

|

Updated on: Dec 28, 2022 | 9:11 PM

ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌, ఎస్సై పోస్టులకు దరఖాస్తు గడువును పెంపొగిస్తూ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బుధవారం ప్రకటన విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు డిసెంబర్‌ 28, ఎస్సై పోస్టులకు జనవరి 18 తేదీలతో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. తాజా ప్రకటనలతో కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు జనవరి 7 సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఎస్సై ఉద్యోగాలకు జనవరి 18 సాయంత్రం 5గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు తెల్పింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవల్సిందిగా బోర్డు సూచించింది.

కాగా ఏపీ సర్కార్‌ విడుదల చేసిన 6,511 పోలీసు ఉద్యోగాలకు రెండేళ్ల వయోపరిమితిని పెంచుతూ జగన్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసు నియామకాలకు దరఖాస్తు చేసుకోవడానికి గడువును పొడిగిస్తూ ప్రకటన విడుదలైంది. ఎస్‌ఐ పోస్టులు 411, కానిస్టేబుల్‌ పోస్టులు 6,100 వరకు ఉన్నాయి. ఈ పోస్టులన్నింటికీ పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీఎస్‌పీ రిజర్వ్‌ సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ పోస్టులకు పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కానిస్టేబుల్‌ పోస్టులకు జనవరి 22న, ఎస్సై పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమనరీ రాత పరీక్ష నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.