TS Labour welfare Scholarship 2022: టెన్త్‌/ఇంటర్‌ పాసైన తెలంగాణ విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

2021-22 విద్యాసంవత్సరంలో పదో తరగతి, ఇంటర్‌తో సహా 17 రకాల కోర్సుల్లో ఉత్తీర్ణులైన కార్మికుల పిల్లలకు మెరిట్‌ ఆధారంగా స్కాలర్‌షిప్‌ ఆందజేతకు తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది..

TS Labour welfare Scholarship 2022: టెన్త్‌/ఇంటర్‌ పాసైన తెలంగాణ విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
TS Labour welfare Scholarship
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 28, 2022 | 9:31 PM

2021-22 విద్యాసంవత్సరంలో పదో తరగతి, ఇంటర్‌తో సహా 17 రకాల కోర్సుల్లో ఉత్తీర్ణులైన కార్మికుల పిల్లలకు మెరిట్‌ ఆధారంగా స్కాలర్‌షిప్‌ ఆందజేతకు తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు ఫారాలను సంబంధిత అసిస్టెంట్‌ కమిషనర్‌ కార్యాలయంలో పొందవచ్చని సూచించింది. పూర్తి చేసిన దరఖాస్తులను ఫిబ్రవరి 15లోపు ఆయా కార్యాలయాల్లో సమర్పించాలని సూచించింది.

ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి కర్మాగారాలు, వాణిజ్య సంస్థలు తదితర చోట్ల పనిచేస్తున్న కార్మికుల పిల్లలు మాత్రమే అర్హులు. ఆయా తరగతి, కోర్సు, డిగ్రీని బట్టి మెరిట్‌ ఆధారంగా స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేయడం జరుగుతుంది. అర్హులైన విద్యార్ధులు గడువులోగా దరఖాస్తులను సమర్పించాలని, ఇతర వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చని సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.