School Girl: స్కూల్‌ విద్యార్ధినితో పరారైన పోలీస్‌ సబ్ ఇన్స్‌పెక్టర్‌.. ఎక్కడ జరిగిందంటే..

ప్రేమ గుడ్డిదంటారు.. పిచ్చిది కూడా.. అని ఈ సంఘటన చూస్తే అర్ధమవుతుంది. ఓ పోలీస్‌ సబ్ ఇన్స్‌పెక్టర్‌ స్కూల్‌ విద్యార్ధినిని ప్రేమించడమేకాకుండా, ఆ బాలికతో పరారయ్యాడు. స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటన..

School Girl: స్కూల్‌ విద్యార్ధినితో పరారైన పోలీస్‌ సబ్ ఇన్స్‌పెక్టర్‌.. ఎక్కడ జరిగిందంటే..
Crime News
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 28, 2022 | 6:49 PM

ప్రేమ గుడ్డిదంటారు.. పిచ్చిది కూడా.. అని ఈ సంఘటన చూస్తే అర్ధమవుతుంది. ఓ పోలీస్‌ సబ్ ఇన్స్‌పెక్టర్‌ స్కూల్‌ విద్యార్ధినిని ప్రేమించడమేకాకుండా, ఆ బాలికతో పరారయ్యాడు. స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో పలియాలో సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న జోగేంద్ర సింగ్ రెండు రోజుల క్రితం స్కూల్‌ విద్యార్ధినితో పరారయ్యాడు. బాలిక డిసెంబర్‌ 9న ఇంటికి వెళ్లి, మళ్లీ డిసెంబర్‌ 12న హాస్టల్‌కు చేరుకుంది. ఆ తర్వాత లక్నోలో తను ఉంటుంన్న హాస్టల్‌ గదిని ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు బాలిక స్నేహితులు, ఆమె తండ్రికి సమాచారం అందిచారు.

దీంతో తన కూతురికి మాయమాటలు చెప్పి ఎస్సై ఆమెను తీసుకుని వెళ్లినట్లు బాలిక తండ్రి లక్నోలోని పోలీసధికారులకు ఫిర్యాదు చేశాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలిక కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరైనందుకుగానూ ఇప్పటికే జోగేంద్ర సింగ్‌ను సీనియర్‌ అధికారులకు సస్పెండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రై వార్తల కోసం క్లిక్‌ చేయండి.