Niagara Falls frozen: గడ్డకట్టిన నయాగరా సొగసులు.. చూపరులను కనువిందు చేస్తోన్న తాజా ఫొటోలు..
అమెరికాలో మంచు తుఫాను కారణంగా అక్కడ జనజీవనం స్తంభించి పోయింది. రోడ్లు, ఇల్లు, పరిసరప్రాంతాలన్నీ మంచుతో నిండిపోయాయి. విస్తృత స్థాయిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రవాణా సౌకర్యం కూడా..
అమెరికాలో మంచు తుఫాను కారణంగా అక్కడ జనజీవనం స్తంభించి పోయింది. రోడ్లు, ఇల్లు, పరిసరప్రాంతాలన్నీ మంచుతో నిండిపోయాయి. విస్తృత స్థాయిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రవాణా సౌకర్యం కూడా లేకపోవడంతో తీవ్ర హిమపాతం, అతి శీతల గాలుల కారణంగా అమెరికా గజగజలాడిపోతోంది. ఇప్పటికే 27 మంది మృతి చెందినట్లు అక్కడి మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇప్పటికీ అమెరికాలో హిమపాతం ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.
తాజాగా అక్కడ నెలకొన్న జీరో ఉష్ణోగ్రతల కారణంగా అతిపెద్ద జలపాతంగా పేరుగాంచిన నయాగరా కూడా గడ్డకట్టుకుపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఎప్పుడూ ఉధృతంగా ప్రవహించే నయాగరా ఎటువంటి కదలికలు లేకుండా పూర్తిగా స్తంభించినట్లు న్యూయార్క్ పోస్ట్ మీడియా పేర్కొంది. నయాగరా పార్క్స్ వెబ్‌సైట్ ప్రకారం.. అమెరికాలో నమోదవుతున్న చల్లని ఉష్ణోగ్రతల వల్ల పొగమంచు ప్రవహించే నీటిపై పొరలా ఏర్పడింది. ఐతే పైకి జలపాతం ఆగిపోయినట్లు కనిపించినా.. ఈ మంచు పొర కింద నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. నయాగరా జలపాతం మీదుగా ప్రతి సెకనుకు 3,160 టన్నుల నీరు ప్రవహిస్తుంటుంది. సెకనుకు 32 అడుగుల ఎత్తు నుంచి నీళ్లు జాలువారుతుంటాయి. చలికాలంలో నదిపై మంచు ఐస్ బ్రిడ్జ్‌లా ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన ఐస్ బ్రిడ్జ్ విరిగి, అక్కడ నిలబడిన ముగ్గురు వ్యక్తులు 1912లో నయాగరాలోపడిపోయి మృతి చెందారు. దీంతో శీతా కాలంలో నయాగరాపై ఏర్పడే ఐస్‌బ్రిడ్జ్‌పై నడవడాన్ని అక్కడి ప్రభుత్వం నిషేధించింది.
The #ChristmasEveEve #PolarVortex is currently impacting Northeast and Southeast US. This was reminiscent of my own #ArcticBlast experience in 2014. Similar frigid temperatures impacted United States while a more severe #windchill event hammered locations north of the border! pic.twitter.com/KWr0xoojBy
— Escondido Weather Observer (CoCoRaHs: CA-SD-197) (@KCAESCON230) December 23, 2022
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.