AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీడు మామూలోడు కాదు! ఆధార్‌తో బ్యాంక్‌ ఖాతాల్లో పెద్ద మొత్తంలో నగదు ఖాళీ చేసేశాడు..

ఆధార్‌ ద్వారా బ్యాంకు అకౌంట్లను ఖాళీ చేస్తున్న నేరస్తున్ని తెలంగాణ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. బిహార్‌ రాష్ట్రంలోని కిషన్‌గంజ్‌ జిల్లా కొచ్చడమాన్‌కు చెందిన అక్మల్‌ అలమ్‌ అనే వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఖాతా నుంచి పెద్ద మొత్తంలో..

వీడు మామూలోడు కాదు! ఆధార్‌తో బ్యాంక్‌ ఖాతాల్లో పెద్ద మొత్తంలో నగదు ఖాళీ చేసేశాడు..
Aadhaar Card Frauds
Srilakshmi C
|

Updated on: Dec 28, 2022 | 2:48 PM

Share

ఆధార్‌ ద్వారా బ్యాంకు అకౌంట్లను ఖాళీ చేస్తున్న నేరస్తున్ని తెలంగాణ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. బిహార్‌ రాష్ట్రంలోని కిషన్‌గంజ్‌ జిల్లా కొచ్చడమాన్‌కు చెందిన అక్మల్‌ అలమ్‌ అనే వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఖాతా నుంచి పెద్ద మొత్తంలో డబ్బు చోరీ చేసినందుకు తెలంగాణ సీఐడీ పోలీసులు మంగళవారం (డిసెంబర్‌ 27) అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

వివిధ బ్యాంకుల్లో ఖాతాదారుల సౌలభ్యం కోసం ఏఈపీఎస్‌ పేరుతో ప్రత్యేక సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు బ్యాంకు అకౌంట్‌ వివరాలు, ఆధార్‌ నంబర్‌, వేలిముద్రలను సంబంధిత బ్యాంకుకు సమర్పించాలి. ఆ తర్వాత సదరు ఖాతాదారులు లావాదేవీలు నిర్వహించాలనుకుంటే.. బ్యాంకులో వేలిముద్ర వేస్తే ఆన్‌లైన్‌ ద్వారా నగదు ఉపసంహరణ, నగదు డిపాజిట్‌, నగదు బదిలీల వంటి లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఖాతాదారుల సౌలభ్యం కోసం ఈ సులభమైన పద్ధతిని అందుబాటులోకి తెచ్చారు. ఐతే ఈ విధానాన్ని ఆసరాగా తీసుకుని నిందితుడు అక్మల్‌ అలమ్‌ అనే తెలంగాణకు చెందిన ఓ ఎస్బీఐ బ్యాంకు ఖాతాదారుని నుంచి పెద్ద మొత్తంలో డబ్బు కాజేశాడు. అందుకు ముందుగా రిజిస్ట్రేషన్లశాఖలోని ధ్రువపత్రాలు, వాటి నుంచి వేలిముద్రలు సేకరించాడు. వాటి ఆధారంగా ఏఈపీఎస్‌ సేవలు పొందుతున్న ఖాతాదారుల వివరాలు సేకరించి, వారి వేలిముద్రలను సిలికాన్‌ మోల్డ్‌తో డూప్లికేట్‌ వేలిముద్రలు తయారు చేశాడు. ఆ తర్వాత బ్యాంకుల ఏటీఎంలలో వేలిముద్రల ద్వారా డబ్బు విత్‌డ్రా చేశాడు. ఇలాంటి లావాదేవాలకు పిన్‌ నంబర్‌ ఇవ్వాల్సిన అవసరంలేకపోవడం నిందితుడికి బాగా కలిసొచ్చింది. ఈ విధంగా అక్మల్‌ పలువురు ఖాతాదారులకు సంబంధించిన నకిలీ వేలిముద్రల ద్వారా ఏటీఎంల నుంచి పెద్దమొత్తంలో డబ్బు కాజేసినట్లు మీడియాకు తెలిపారు.

వరుసగా నమోదవుతున్న సైబర్‌ క్రైమ్‌లపై తెలంగాణ సీఐడీ అధికారులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు నిందితుడు అక్మల్‌ను బిహార్‌లో డిసెంబర్‌ 22న అరెస్టు చేశారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచి జైలుకు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రై వార్తల కోసం క్లిక్‌ చేయండి.