NIT Warangal Jobs: బీటెక్‌/ బీఈ అర్హతతో వరంగల్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో టీచింగ్‌ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌లోనున్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌).. 100 ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..

NIT Warangal Jobs: బీటెక్‌/ బీఈ అర్హతతో వరంగల్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో టీచింగ్‌ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
NIT Warangal
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 27, 2022 | 9:41 PM

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌లోనున్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌).. 100 ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. విల్‌, ఎలక్ట్రికల్‌, ఈసీఈ, మెటలార్జికల్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, బయోటెక్నాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఏ/ బీఎస్సీ/ బీకామ్‌/ బీటెక్‌/ బీఈ/ ఎంఈ/ ఎంటెక్‌/ ఎంఎస్‌/ ఎంఎస్సీ/ పీజీ/ ఎంఏ/ పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తుదారుల వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు జవనరి 25, 2023వ తేదీలోపు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.1000లు, ఎస్సీ/ఎస్టీ ఇతర కేటగిరీ అభ్యర్ధులు రూ.500లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. షార్ట్‌లిస్టింగ్‌, రాత పరీక్ష,ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.