DMHO Chittoor: 5వ/పదో తరగతి అర్హతతో రాత పరీక్షలేకుండా చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు.. నెలకు రూ.1,10,000ల జీతం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన చిత్తూరు జిల్లా వైద్యారోగ్య కార్యాలయం.. 53 స్టాఫ్‌ నర్స్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, పెడియాట్రీషియన్‌, సెక్యూరిటీగార్డ్స్‌, మెడికల్‌ ఆఫీసర్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

DMHO Chittoor: 5వ/పదో తరగతి అర్హతతో రాత పరీక్షలేకుండా చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు.. నెలకు రూ.1,10,000ల జీతం..
Andhra Pradesh
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 27, 2022 | 9:55 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన చిత్తూరు జిల్లా వైద్యారోగ్య కార్యాలయం.. 53 స్టాఫ్‌ నర్స్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, పెడియాట్రీషియన్‌, సెక్యూరిటీగార్డ్స్‌, మెడికల్‌ ఆఫీసర్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి ఐదో తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్‌/ జీఎన్‌ఎం/ బ్యాచిలర్స్‌ డిగ్రీ/ బీఎస్సీ/ ఎంబీబీఎస్‌/ డిప్లొమా/ పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు డిసెంబర్‌ 31, 2022వ తేదీలోపు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా అప్లికేషన్లను పంపించవల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్ధులు రూ.300 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/బీసీ/వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. విద్యార్హతలు, అనుభవం ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికై వారికి నెలకు రూ.12,000ల నుంచి రూ.1,10,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్..

District Medical and Health Officer, Chittoor, AP.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.