పరీక్షల్లో కాపీ కొట్టే విద్యార్ధులను కఠినంగా శిక్షించాలి.. వారిపట్ల ఉదాశీనత తగదు: హైకోర్టు

పరీక్షల్లో కాపీలు కొట్టే విద్యార్ధులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. పరీక్షల్లో కాపీలకు పాల్పడే విద్యార్ధుల పట్ల ఉదాసీనత చూపవద్దని, ఇది నిజంగా ఆందోళనకలిగించే విషయమని..

పరీక్షల్లో కాపీ కొట్టే విద్యార్ధులను కఠినంగా శిక్షించాలి.. వారిపట్ల ఉదాశీనత తగదు: హైకోర్టు
Delhi High Court
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 27, 2022 | 9:06 PM

పరీక్షల్లో కాపీలు కొట్టే విద్యార్ధులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. పరీక్షల్లో కాపీలకు పాల్పడే విద్యార్ధుల పట్ల ఉదాసీనత చూపవద్దని, ఇది నిజంగా ఆందోళనకలిగించే విషయమని హైకోర్టు పేర్కొంది. పరీక్షల్లో ఎలాగైనా ఉత్తీర్ణత సాధించాలనే దురాలోచనతో విద్యార్ధులు అడ్డదారులు తొక్కుతున్నారంది. అక్రమంగా పాసయ్యే విద్యార్ధులు ఈ దేశాన్ని నిర్మించలేరు. వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరించవద్దు. జీవితంలో అన్యాయమైన మార్గాలను ఆశ్రయించకుండా గుణపాఠం నేర్చుకునేలా చేయాలని చీఫ్ జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ అన్నారు. మోసాలకు పాల్పడిన విద్యార్ధులను కేటగిరీ IV శిక్ష విధించకుండా యూనివర్శిటీలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఢిల్లీ టెక్నికల్ యూనివర్శిటీ (డీటీయూ) సెమిస్టర్‌ పరీక్షల్లో రెండు సబ్జెక్టుల్లో కాపీ కొట్టినందుకు యోగేష్ పరిహార్ అనే ఇంజనీరింగ్ అనే విద్యార్ధి సెకండ్‌ సెమిస్టర్ పరీక్షన్నింటినీ వర్సిటీ వైస్-ఛాన్సలర్ రద్దు చేశారు. మూడో సెమిస్టర్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేశారు. దీనిని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో విద్యార్ధి పిటిషన్‌ వేశాడు. నేడు పిటీషన్‌ను విచారించిన హైకోర్టు సింగిల్‌ బెంచ్ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో డీటీయూ వీసీ జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. రెండో సెమిస్టర్‌కు మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేసుకుని మళ్లీ కోర్సు మొత్తం చదవాల్సిందేనని ధర్మాసనం తీర్పు వెలువరించింది. పరీక్షల్లో కాపీలు కొట్టే విద్యార్ధుల వల్ల కష్టపడి చదివే విద్యార్ధులకు ప్రయోజనం చేకూరడంలేదని కోర్టు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.