AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో అత్యధికంగా మెడికల్ సీట్లు అందుబాటులోకి తెచ్చిన సర్కార్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా వైద్య విద్య అనుబంధ కోర్సులను ప్రారంభించించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి మొత్తం 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 12 రకాల బీఎస్సీ అనుబంధ కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ..

Telangana: తెలంగాణలో అత్యధికంగా మెడికల్ సీట్లు అందుబాటులోకి తెచ్చిన సర్కార్‌
Telangana Medical Education
Srilakshmi C
|

Updated on: Dec 27, 2022 | 6:50 PM

Share

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా వైద్య విద్య అనుబంధ కోర్సులను ప్రారంభించించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి మొత్తం 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 12 రకాల బీఎస్సీ అనుబంధ కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ జీవో నెంబర్ 156ను విడుదల చేసింది. దీంతో గాంధీ, కాకతీయ, రిమ్స్, ఉస్మానియా, నిజామాబాద్, సిద్ధిపేట, నల్గొండ, సూర్యపేట్, మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఈ కోర్సులు ప్రారంభమవుతున్నాయి.

రాష్ట్ర ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలతో పాటు, వైద్య విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రం ఏర్పాటు తర్వాత 12 మెడికల్ కాలేజీలు ప్రారంభించగా, మరో రెండేళ్లలో జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసేలా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య విద్య అనుబంధ సేవలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీఎస్సీ మొదటి ఏడాది, 12 వైద్య విద్య అనుబంధ కోర్సులు ప్రారంభించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరం (2022-23) నుంచే ఈ కోర్సులు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మూడేళ్ల కోర్సు, ఏడాది ఇంటర్న్ షిప్‌తో కలుపుకొని నాలుగేళ్ల కాల వ్యవధి ఉంటుంది. అనస్థీషియా, ఆపరేషన్ థియేటర్, రెస్పిరేటరీ థెరపీ, రీనల్ డయాసిస్, న్యూరోసైన్స్, క్రిటికల్ కేర్, రేడియాలజీ అండ్ ఇమేజింగ్, ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ, మెడికల్ రికార్డ్స్ సైన్సెస్, ఆప్తోమెట్రిక్, కార్డియాక్ అండ్ కార్డియోవాస్క్యూలార్ టెక్నాలజీ కోర్సులు ఇందులో ఉన్నాయి. తాజా నిర్ణయం వల్ల ప్రతి ఏడాది 860 మంది విద్యార్ధులు లబ్ధి పొందనున్నారు. తద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మరింత మెరుగవనున్నాయి.

మెడికల్ కాలేజీ….    సీట్లు

ఇవి కూడా చదవండి
  • గాంధీ                   150
  • ఉస్మానియా        210
  • కాకతీయ             130
  • ఆదిలాబాద్       60
  • నిజామాబాద్    110
  • సిద్ధిపేట           50
  • నల్గొండ           40
  • సూర్యపేట       40
  • మహబూబ్నగర్ 70

మొత్తం            860

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.