Immunity in Winter Season: శీతాకాలంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలంటే..

శీతాకాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ తగ్గుముఖం పడుతున్న కొద్దీ వ్యాధులు ఒక్కోక్కటిగా దాడి చేస్తుంటాయి. చలిగా ఉండటం వల్ల రోజువారీ ఎక్సర్‌సైజ్‌లను కూడా వాయిదా వేస్తుంటారు. వాతావరణంలో వచ్చే మార్పుల్ని తట్టుకోవాలంటే రోగ నిరోధక శక్తి బలంగా..

Immunity in Winter Season: శీతాకాలంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలంటే..
Winter Season
Follow us

|

Updated on: Dec 27, 2022 | 5:00 PM

శీతాకాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ తగ్గుముఖం పడుతున్న కొద్దీ వ్యాధులు ఒక్కోక్కటిగా దాడి చేస్తుంటాయి. చలిగా ఉండటం వల్ల రోజువారీ ఎక్సర్‌సైజ్‌లను కూడా వాయిదా వేస్తుంటారు. వాతావరణంలో వచ్చే మార్పుల్ని తట్టుకోవాలంటే రోగ నిరోధక శక్తి బలంగా ఉండాలి. లేదంటే జలుబు, దగ్గు, ఆస్తమాతో పాటు పలు చర్మ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. ఇక వీటికి తోడు ప్రస్తుతం కరోనా వైరస్‌ ముప్పు పొంచి ఉంది. రోగ నిరోధక శక్తి దృఢంగా లేకపోతే చలికాలంలో ఆరోగ్యం పైనా తీవ్ర ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. ఈ కాలంలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక అనారోగ్య సమస్య తలెత్తుతూనే ఉంటుంది. కాబట్టి ఈ శీతాకాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు అంటున్నారు.

ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం శుభ్రంగా ఉండాలి. అలాగే పోషకాలతో కూడిన ఆహారాలు తీసుకోవడం ఈ కాలంలో ఎంతో అవసరం. అలాగే ఈ కాలంలో పెద్దగా దాహంగా అనిపించదు. దీంతో ఎప్పుడోగానీ నీళ్లు తాగరు. అలాకాకుండా.. ప్రతి రోజు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీళ్లు తప్పనిసరిగా తాగాలి. వీలైనన్ని ఎక్కువసార్లు మూత్ర విసర్జణ చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని మలినాలు ఎప్పటికప్పుడు బయటికి వెళ్లిపోతే.. రోగనిరోధక శక్తి క్రమంగా బలపడుతుంది. అలాగే రెండుసార్లు మలవిసర్జన చేయడం కూడా మంచిదే. దీనివల్ల జీర్ణాశయ పేగులు శుభ్రమవుతాయి. ఆహారం త్వరగా జీర్ణం అవ్వాలంటే వేడిగా ఉన్నప్పుడు తినాలి. రాత్రిళ్లు అయితే 7 గంటలలోపే తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. ఆకు కూరలు, మొలకెత్తిన విత్తనాలు, పండ్లు, కూరగాయలు, ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి బలంగా తయారవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.