ICICI Loan Fraud Case: ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో చందాకొచ్చర్‌కు బాంబే హైకోర్టులో చుక్కెదురు..!

వీడియోకాన్ గ్రూప్ కంపెనీలకు మంజూరు చేసిన వేల కోట్ట రుణం వ్యవహారంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో చందాకొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌ దంపతులను సీబీఐ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో త్వరిత గతిన విచారణకు..

ICICI Loan Fraud Case: ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో చందాకొచ్చర్‌కు బాంబే హైకోర్టులో చుక్కెదురు..!
ICICI Loan Fraud Case
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 27, 2022 | 2:45 PM

వీడియోకాన్ గ్రూప్ కంపెనీలకు మంజూరు చేసిన వేల కోట్ట రుణం వ్యవహారంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో చందాకొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌ దంపతులను సీబీఐ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో త్వరిత గతిన విచారణకు అనుమతి ఇవ్వవల్సిందిగా దాఖలు చేసిన పిటీషన్‌ను బాంబే హైకోర్టు ఈ రోజు తోసిపుచ్చింది. జనవరి 2న సాధారణ విచారణకు కోర్టులో హాజరుకావల్సిందిగా కొచ్చర్‌ దంపతులను కోర్టు ఆదేశించింది. కాగా గత శుక్రవారం అరెస్టు అయిన చందాకొచ్చర్ దంపతులకు ప్రత్యేక కోర్టు మూడు రోజుల రిమాండ్‌ విధించింది. సీబీఐ కస్టడీని సవాల్ చేస్తూ చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అవినీతి నిరోధక చట్టం కింద తమ అరెస్టు చట్టవిరుద్ధమని, విచారణ ప్రారంభించేందుకు చట్టంలోని సెక్షన్ 17ఎ కింద దర్యాప్తు చేయడానికి ఏజెన్సీకి అనుమతి లేదని కొచ్చర్‌ దంపతులు కోర్టులో పిటిషన్‌ వేశారు. తాజాగా వీరి పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం వీరిని సీబీఐ విచారణ చేస్తోంది.

ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవోగా ఉన్నప్పుడు వీడియోకాన్ గ్రూప్‌ కంపెనీలకు ఇచ్చిన రూ.3,250 కోట్ల రుణంలో మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు కొచ్చర్‌ దంపతులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో భాగమైన వీడియోకాన్‌ గ్రూపు ఛైర్మన్‌ వేణుగోపాల్‌ ధూత్‌ను సైతం సీబీఐ సోమవారం (డిసెంబర్‌ 26) అరెస్ట్‌ చేసింది. డిసెంబరు 28 వరకు కొచ్చర్‌ దంపతులతో పాటు వేణుగోపాల్‌ ధూత్‌ కూడా సీబీఐ కస్టడీలో ఉంటారు. రుణం మంజూరైన తర్వాత వీడియోకాన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్ ధూత్ నుంచి వచ్చిన రూ.64 కోట్లను చందా కొచ్చర్‌ భర్త అయిన దీపక్‌ కొచ్చర్‌ తన కంపెనీ నూపవర్ రెన్యూవబుల్ లిమిటెడ్‌లో పెట్టుబడిగా పెట్టినట్లు సీబీఐ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు