Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జ్యోతిష్యుని మాటలు నమ్మి భర్తను హత్య చేసిన మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్‌

డ్రైవర్‌తో వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు కట్టుకున్న భర్తను కడతేర్చింది ఓ మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్‌. తమిళనాడులో ఆల్యంగా వెలుగు చేసిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే..

జ్యోతిష్యుని మాటలు నమ్మి భర్తను హత్య చేసిన మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్‌
SSI murdered her husband
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 27, 2022 | 4:42 PM

డ్రైవర్‌తో వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు కట్టుకున్న భర్తను కడతేర్చింది ఓ మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్‌. తమిళనాడులో ఆల్యంగా వెలుగు చేసిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే.. తమిళనాడులోని సింగర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో స్పెషల్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న చిత్ర (47)కు, కల్లావికి చెందిన సెంథిల్‌ కుమార్‌ (48)తో చాలా ఏళ్ల క్రితం వివాహం జరిగింది. సెంథిల్‌ కుమార్‌ కూడా పోలీసధికారే. ఐతే 2012లో ఓ కేసులో సెంధిల్‌ను విధుల నుంచి తొలగించారు. అనంతరం భార్య చిత్రతో విభేదాలు తలెత్తడంతో దంపతులిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో చిత్ర తన కారు డ్రైవర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న సెంథిల్ భార్యను హెచ్చరించాడు. అయినా తీరుమార్చుకోని చిత్ర సంబంధాన్ని కొనసాగించింది.

అనంతరం చిత్ర జ్యోతిష్యురాలైన సరోజను కలిసి తన సమస్యను చెప్పుకొంది. దీంతో తన భర్తను చంపాలని చిత్రకు సూచించింది సరోజ. అందుకు రూ.10 లక్షల సుపారీతో రౌడీలను సైతం మాట్లాడింది. పథకం ప్రకారం సెప్టెంబర్ 16న చిత్ర తన భర్తను రౌడీల సాయంతో హత్య చేసి మృతదేహాన్ని ఉత్తంగరైలోని బావిలో పడేసింది. అక్టోబర్ 31న తన కుమారుడు కనిపించడం లేదంటూ సెంథిల్ తల్లి బక్కియం కృష్ణగిరి కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేసింది. నవంబర్ రెండో వారంలో ఈ కేసును కల్లావి పోలీసులకు బదిలీ చేశారు.

విచారణలో భాగంగా చిత్ర, సెంథిల్‌ దంపతుల కుమారుడు కమల్‌రాజ్‌ (19)ను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా.. అసలు విషయం బయటపడింది. సెంథిల్‌ను హత్య చేసినట్లు కృష్ణగిరి మెజిస్ట్రేట్‌ ముందు అంగీకరించాడు. విచారన అనంతరం సెంథిల్ మృతదేహాన్ని బావిలో నుంచి పోలీసులు బయటకు తీశారు. నిందితులు చిత్ర (47)తోపాటు ఎం సరోజ (37), విజయ కుమార్ (33), రాజా పాండియలను పోలీసులు శనివారం రాత్రి (డిసెంబర్‌ 24) అరెస్టు చేశారు. ఈ కేసులో మిగిలిన ముగ్గురి కోసం ఉత్తంగరై పోలీస్ ఇన్‌స్పెక్టర్ పార్థిబన్ నేతృత్వంలో 15 మంది పోలీసులు మూడు బృందాలుగా గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.