7th pay commission: ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. భారీగా పెరగనున్న డీఏ.. వివరాలివే..
7th pay commission updates: న్యూ ఇయర్ వేళ ప్రభుత్వ ఉద్యోగులకు త్రిపుర రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి మాణిక్ సాహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు,
న్యూ ఇయర్ వేళ ప్రభుత్వ ఉద్యోగులకు త్రిపుర రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి మాణిక్ సాహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నూతన సంవత్సర కానుకను ప్రకటించారు. ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్, పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్‌ను 12 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన డీఏ, డీఆర్ డిసెంబర్ 1 నుంచి వర్తించనుంది. తాజా నిర్ణయంతో రాష్ట్ర ఉద్యోగుల డీఏ 8 శాతం నుంచి 20 శాతానికి పెరిగింది.
వీరి జీతం రెట్టింపు అవనుంది..
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 1,04,600 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 80,800 మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. అలాగే తాత్కాలిక ఉద్యోగులకు కూడా వారి పారితోషికం దాదాపు రెండింతలు పెరగనుంది. ఇక డీఏ/డీఆర్‌లను 12 శాతం పెంచడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి నెలా రూ.120 కోట్లు, వార్షిక ప్రాతిపదికన రూ.1,440 కోట్ల అదనపు భారం పడుతుందని ముఖ్యమంత్రి సాహా తెలిపారు. వనరుల కొరత ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వేతన నిర్మాణాన్ని సవరించిందని సీఎం చెప్పారు. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు లబ్ధి పొందుతాయన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 4 శాతం పెరగవచ్చు..
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 2023 మొదటి డీఏ 4 శాతం పెరిగే ఛాన్స్ ఉందని అని తెలుస్తోంది. అంటే 7వ వేతన సంఘం నిబంధనల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ రేటు 42కి పెరగనుంది. ఈ పెంపుతో 48 లక్షల మంది ఉద్యోగులతో పాటు 68 లక్షల మంది పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (డిఆర్) రూపంలో భారీ ఊరట లభించనుంది. 2022 జనవరిలో 3 శాతం డీఏ పెంచడంతో.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ రేటు 31 శాతం నుంచి 34 శాతానికి పెరిగింది. ఆ తరువాత 2022లో రెండవ దఫా డీఏ ను 4 శాతం పెంచడంతో అదికాస్తా 38 శాతానికి చేరింది. ఇప్పుడు విశ్వసనీయ సమాచారం ప్రకారం 4 శాతం డీఏ పెంచితే.. అది 42 శాతానికి చేరుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..