Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుతిన్ నిర్ణయాలను వ్యతిరేకించిన రష్యన్‌ వ్యాపారవేత్త మృతి.. భారత్‌ పర్యటనకు వచ్చిన నలుగురిలో.. ఇద్దరు..

భారత పర్యటనకు వచ్చిన రష్యా జాతీయులు ఇద్దరు ఒడిశాలో అనుమానాస్పదంగా మృతిచెందడం కలకలం రేపింది. ఒడిశాలోని రాయగడ హోటల్లో బసచేసిన నలుగురు రష్యన్లలో రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు మృతిచెందారు.

పుతిన్ నిర్ణయాలను వ్యతిరేకించిన రష్యన్‌ వ్యాపారవేత్త మృతి.. భారత్‌ పర్యటనకు వచ్చిన నలుగురిలో.. ఇద్దరు..
Vladimir Putin, Pavel Antov
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 27, 2022 | 3:48 PM

భారత పర్యటనకు వచ్చిన రష్యా జాతీయులు ఇద్దరు ఒడిశాలో అనుమానాస్పదంగా మృతిచెందడం కలకలం రేపింది. ఒడిశాలోని రాయగడ హోటల్లో బసచేసిన నలుగురు రష్యన్లలో రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు మృతిచెందారు. మృతుల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ నిర్ణయాలను వ్యతిరేకించిన సాసేజ్ వ్యాపారవేత్త, ఎంపీ పావెల్ ఆంటోవ్ ఉండటం చర్చనీయాంశంగా మారింది. పావెల్ ఆంటోవ్ మృతిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తన స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేకే పావెల్‌ ఆంటోవ్‌ హోటల్‌ కిటికీ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పుతిన్‌కు చెందిన యునైటెడ్ రష్యా పార్టీ నుంచి మిలియనీర్ పావెల్ ఆంటోవ్.. శాసన సభ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.

రష్యన్ పర్యాటకుడు అనుమానాస్పదంగా మరణించిన రెండు రోజుల తరువాత పావెల్ ఆంటోవ్.. హోటల్ మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని, అతనిని వెంటనే భారతీయ గైడ్ ఆసుపత్రికి తరలించారని వార్త సంస్థ ANI పేర్కొంది. ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటి తర్వాత అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఆంటోవ్ వ్లాదిమిర్ ప్రాంతంలో శాసన సభ సభ్యుడిగా ఉన్నారు.

పావెల్ ఆంటోవ్ తన 66వ పుట్టినరోజును జరుపుకోవడానికి స్నేహితులతో కలిసి భారత్‌కు వచ్చారు. రాయగడలోని హోటల్ సాయి ఇంటర్నేషనల్ వెలుపల రక్తపు మడుగులో ఆయన తేలండం తీవ్ర కలకలం రేపింది. తన స్నేహితుడి మరణం కారణంగా పావెల్ డిప్రెషన్‌లో ఉన్నారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు పావెల్ ఆంటోవ్ ఖండించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ సందేశాన్ని ఎవరో పోస్ట్ చేశారు. అధ్యక్షుడికి, నా దేశానికి నేను భక్తుడినని తెలిపారు. ఉక్రెయిన్‌పై క్రెమ్లిన్ దాడికి ఒక లక్ష్యం ఉందని పావెల్ ఆంటోవ్ వివరణ ఇచ్చారు.

రెండు రోజుల్లో ఇద్దరు పౌరుల అనుమానాస్పద స్థితిపై రష్యా ఎంబసీ స్పందించింది . కోల్‌కతాలోని రష్యా కాన్సుల్ జనరల్ అలెక్సీ ఇడంకిన్ ఈ వ్యవహారంపై మాట్లాడారు. పావెల్ మరణంలో ఎలాంటి అనుమానాస్పద విషయం లేదన్నారు. డిసెంబరు 22న అదే హోటల్‌లో అతని స్నేహితుడు వ్లాదిమిర్ బిడెనోవ్ చనిపోయారు. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత పావెల్ చనిపోయారని తెలిపారు.

వ్లాదిమిర్, పావెల్ సహా మరో ఇద్దరు భారత పర్యటనకు వచ్చారు. వారు తమ గైడ్ జితేంద్ర సింగ్‌తో కలిసి బుధవారం (21న) రాయగడ పట్టణంలోని హోటల్‌కు వచ్చారు. పావెల్ మరణంపై అన్ని కోణల్లో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. అతను ప్రమాదవశాత్తు టెర్రస్ నుంచి పడిపోయారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..