AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO Pension Hike: పీఎఫ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ డిమాండ్ నెరవేరితే పెన్షన్ భారీగా పెరిగే అవకాశం..

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగులకు అండగా నిలుస్తుంది. ఉద్యోగం చేస్తున్న సమయంలో జీతం నుంచి పీఎఫ్‌ కట్‌ కావడం అనేది సహజంగా జరుగుతుంది. ఈ బ్యాలెన్స్ రిటైర్మెంట్ అప్పుడో లేక..

EPFO Pension Hike: పీఎఫ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ డిమాండ్ నెరవేరితే పెన్షన్ భారీగా పెరిగే అవకాశం..
Epfo
Shaik Madar Saheb
|

Updated on: Dec 22, 2022 | 12:46 PM

Share

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగులకు అండగా నిలుస్తుంది. ఉద్యోగం చేస్తున్న సమయంలో జీతం నుంచి పీఎఫ్‌ కట్‌ కావడం అనేది సహజంగా జరుగుతుంది. ఈ బ్యాలెన్స్ రిటైర్మెంట్ అప్పుడో లేక.. పలు సందర్భాల్లో విత్ డ్రా చేసుకోవడచ్చు. మీకు కూడా పీఎఫ్ అకౌంట్ ఉంటే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే.. వేతనాలు పొందుతున్న వారికి ఈపీఎస్‌ కింద నెలవారీ కనీస పెన్షన్‌ను పెంచాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి కొత్త అప్‌డేట్ వచ్చింది. కనీస నెలవారీ పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.7,500కి పెంచాలని ఈపీఎస్-95 రాష్ట్రీయ సంఘర్ష్ సమితి కార్మిక మంత్రిత్వ శాఖకు సూచించింది. ఈ మేరకు 15 రోజుల నోటీసును మంత్రిత్వ శాఖకు అందించింది. ఈ డిమాండ్‌ను నెరవేర్చకుంటే దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని రాష్ట్రీయ సంఘర్ష్ సమితి నోటీసులో వివరించింది. కనీస పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.7,500కి పెంచాలని, నిర్ణీత వ్యవధిలో డియర్‌నెస్ అలవెన్స్‌ను ప్రకటించాలని కమిటీ డిమాండ్ చేసింది. దీనితో పాటు అక్టోబర్ 4, 2016 నుంచి నవంబర్ 4, 2022 వరకు సుప్రీంకోర్టు నిర్ణయాల ప్రకారం వాస్తవ జీతంపై పెన్షన్ చెల్లించాలని కూడా కమిటీ డిమాండ్ చేసింది.

ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్-1995 (EPS-95) అనేది రిటైర్మెంట్ ఫండ్ బాడీ.. ఇది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఆధ్వర్యంలో పనిచేయడంతోపాటు పలు సూచనలు ఇస్తుంది. దీని కింద ఆరు కోట్ల మందికి పైగా వాటాదారులు, 75 లక్షల మంది పెన్షనర్లు లబ్ధిదారులుగా ఉన్నారు.

పెన్షనర్ల వైద్య సదుపాయాలు కూడా అంతంతమాత్రమే ఉందని ఈపీఎస్-95 పేర్కొంది. పెన్షనర్ల పెన్షన్ మొత్తం చాలా తక్కువగా ఉందని సంఘర్ష్ సమితి కేంద్ర కార్మిక మంత్రి భూపేంద్ర యాదవ్‌కు రాసిన లేఖలో వెల్లడించింది. దీంతోపాటు వైద్య సదుపాయాలు కూడా తక్కువగా ఉన్నాయని.. దీంతో పింఛనుదారుల మరణాల రేటు పెరుగుతోందని ఆవేదన వ్యక్తంచేసింది.

ఇవి కూడా చదవండి

15 రోజుల్లోగా ఈ పింఛను పెంపుదల ప్రకటించకుంటే దేశవ్యాప్త ఆందోళనకు దిగుతామని లేఖలో స్పష్టంచేసింది. ఇందులోభాగంగా రైలు, రోడ్డు రవాణాను నిలిపివేస్తామని.. ఆమరణ నిరాహార దీక్ష వంటి నిరసనకార్యక్రమాలు చేపడతామని హెచ్చరికలు జారీ చేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..