AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medicines Price: మరింత చౌకగా రానున్న పారాసిటమాల్‌.. ఇంకా ఆ మందులపై కూడా.. కొత్త ధరల అమలు ఎప్పటి నుంచి అంటే..

రానున్న రోజులలో మెడిసిన్స్ ‌మరింత చౌకగా మరనున్నాయి. మంగళవారం నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) 127 ఔషధాల ధరలను పరిమితం చేయడంతో ప్రస్తుత సంవత్సరంలో వరుసగా ఐదో సారి మందులు..

Medicines Price: మరింత చౌకగా రానున్న పారాసిటమాల్‌.. ఇంకా ఆ మందులపై కూడా.. కొత్త ధరల అమలు ఎప్పటి నుంచి అంటే..
Some Medicines Are Become More Cheaper
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 22, 2022 | 12:29 PM

Share

రానున్న రోజులలో కొన్ని రకాల మెడిసిన్స్ ‌మరింత చౌకగా మరనున్నాయి. మంగళవారం నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) 127 ఔషధాల ధరలను పరిమితం చేయడంతో ప్రస్తుత సంవత్సరంలో వరుసగా ఐదో సారి మందులు తగ్గినట్లయింది. పారాసిటమాల్ వంటి అనేక ఔషధాల ధరలు ఈ ఏడాది రెండోసారి తగ్గుముఖం పట్టాయి. అయితే మాన్టెలకాస్ట్, మెట్‌ఫార్మిన్ వంటి కొన్ని రకాల మెడిసిన్స్ ధరలు మరింతగా పెరిగాయి. ఎన్‌పీపీఏ విడుదల చేసిన 127 మందుల జాబితాలో పారాసిటమాల్, అమోక్సిసిలిన్, రాబెప్రజోల్, మెట్‌ఫార్మిన్ వంటి మందులు ఉన్నాయి. వీటిలో చాలా రకాల మందులను ప్రజలు నిత్యం వినియోగించేవే ఉన్నాయి. ప్రస్తుతం రూ.2.30లకు విక్రయిస్తున్న పారాసిటమాల్(650ఎంజీ) టాబ్లెట్‌ను ఇకపై రూ.1.8లకే పరిమితమైంది. అమోక్సిసిలిన్, పొటాషియం క్లవులనేట్ ధర కూడా రూ.22.30 నుంచి రూ.16.80కు తగ్గింది. అయితే ఈ సంవత్సరం ప్రారంభంలో కూడా పారాసెటమాల్ ఫార్ములేషన్ ధరలను ఎన్‌పీపీఏ తగ్గించింది. 

వాటితో పాటు మోక్సిఫ్లోక్సాసిన్ (400మి.గ్రా) ధర కూడా ఒక్కో టాబ్లెట్‌కు రూ.31.5 నుంచి రూ.22.8లకు తగ్గింది. న్యుమోనియా వంటి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగించే ఈ ఔషధం ధర ఈ సంవత్సరం మొదటిసారిగా తగ్గింది. అయితే ప్రస్తుతం విడుదలయిన కొత్త జాబితా ప్రకారం, టైప్ 2 మధుమేహం చికిత్సలో ఉపయోగపడే మెట్‌ఫార్మిన్ (500ఎంజీ) వంటి కొన్ని మందుల ధరలను రూ.1.7 నుంచి రూ.1.8లకు పెంచారు. ఇక ఈ ఏడాది కాలంలో మెట్‌ఫార్మిన్ ధరలో అనేక సార్లు మార్పులు జరిగాయి. దీనిపై ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD) జనరల్ సెక్రటరీ రాజీవ్ సింఘాల్ మాట్లాడుతూ ‘ఇది స్వాగతించదగిన మార్పు అయినా కొన్ని మందులు ఇప్పటికే చాలా తక్కువ ధరలతో ఉన్నాయి. భవిష్యత్తులో సరఫరాలపై దీని ప్రభావం ఉండకూడదని నేను ఆశిస్తున్నాను’ అన్నారు.

బెంగాల్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ (BCDA ) సెక్రటరీ సజల్ గంగూలీ ప్రకారం .. ఎన్‌పీపీఏ ప్రకటించిన జాబితా ప్రకారం కొత్త ధరలతో జనవరి చివరి నాటి నుంచి మందులు వస్తాయి. కొత్త ధరలతో మందులు మార్కెట్‌లోకి రావడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుందని, వచ్చే నెలాఖరులోగా కొత్త స్టాక్‌ను అందజేయాలని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.