Omicron BF.7 Symptoms: కరోనా అలెర్ట్.. ఓమిక్రాన్ BF-7 లక్షణాలివే.. తప్పక తెలుసుకోవలసిన విషయాలు మీ కోసం….

ఇటీవల చైనాలో జీరో-కోవిడ్ విధానాన్ని సడలించడంతో ఆ దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. వాటితో పాటు కరోనా వేరియంట్ అయిన ఓమిక్రాన్ నుంచి BF.7 అనే కొత్త సబ్ వేరియంట్ పుట్టుకొచ్చింది. ఈ క్రమంలోనే చైనాతో పాటు

Omicron BF.7 Symptoms: కరోనా అలెర్ట్.. ఓమిక్రాన్ BF-7 లక్షణాలివే.. తప్పక తెలుసుకోవలసిన విషయాలు మీ కోసం....
Corona Virus
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 22, 2022 | 11:09 AM

గడ్డు కాలం గడిచిపోయిందనుకుంటున్న వేళ కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ప్రపంచాన్ని మరో సారి తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని చూస్తున్న కరోనా ఇప్పుడు మరో వేరియంట్‌గా మానవ సమాజాన్ని వెంటడడం ప్రారంభించింది. ఇటీవల చైనాలో జీరో-కోవిడ్ విధానాన్ని సడలించడంతో ఆ దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. వాటితో పాటు కరోనా వేరియంట్ అయిన ఓమిక్రాన్ నుంచి BF-7 అనే కొత్త సబ్ వేరియంట్ పుట్టుకొచ్చింది. ఈ క్రమంలోనే చైనాతో పాటు జపాన్, బ్రెజిల్, అమెరికా తదితర దేశాలలో కూడా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. గడిచిన 8 రోజులలో ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల కేసులు నమోదు అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ప్రపంచదేశాలు మరోసారి ఆందోళనకర పరిస్థితులకు వెళ్లనుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఓమిక్రాన్ సమ్ వేరియంట్ BF-7 ఉద్భవించడంతో సాధారణ ప్రజలతో పాటు  ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)లో కూడా ఆందోళన ప్రారంభమయింది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం తదితర జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

BF-7 వేరియంట్ లక్షణాలు..

  • BF-7 అనేది ఓమిక్రాన్ వేరియంట్ BF-5 నుంచి పుట్టుకువచ్చిన సబ్ వేరియంట్.
  • దీనికి అత్యంత వేగంగా వ్యాప్తి చెందే శక్తి ఉన్నందున ఎక్కువ మందిని ప్రభావితం చేసే సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంటుంది.
  • దీని R-వాల్యూ 10 నుంచి 18.6 వరకు ఉంది. అంటే వ్యాధి సోకిన వ్యక్తి నుంచి సగటున 10 నుంచి 18.6 మందికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది.
  • కోవిడ్ టీకాలు వేయించుకున్న వారికి కూడా తిరిగి ఇన్ఫెక్షన్‌ను కలిగించే అధిక సామర్థ్యాన్ని BF-7 కలిగి ఉంటుంది.
  • కోవిడ్ ఇతర వేరియంట్ల మాదిరిగానే BF-7 లక్షణాలు కోవిడ్-జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారటం, అలసట ఉంటాయి. కొందరికి వాంతులు, విరేచనాలు వంటి జీర్ణశయాంతర సమస్యలు కూడా వ్యాపించే అవకాశం ఉంది.
  • కోెవిడ్ BF-7 సబ్ వేరియంట్ కేసులు ఇప్పటికే అమెరికా, యూకే, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్ వంటి యూరోపియన్ దేశాలతో సహా అనేక ఇతర దేశాలలో కూడా నమోదయ్యాయి.
  • బుధవారం(డిసెంబర్ 21) సాయంత్రం నాటికి భారతదేశంలో కోవిడ్ BF-7 కేసులు మూడు రికార్డయ్యాయి. ఈ కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని భారత ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కరోనా నుంచి కాపాడుకోవడానికి పాటించవలసిన జాగ్రత్తలు..

  • తప్పనిసరి విధిగా భావించి మాస్క్ ధరించడమే కాక శానిటైజన్‌ను ఉపయోగించండి.
  • వీలైనంత తక్కువగా పబ్లిక్‌లో కలవండి. తప్పని సరిగా సామాజిక దూరం పాటించండి.
  • కరోనా ఆపత్కాల సమయంలో చాలామంది ప్రజలు మూలికలతో తయారు చేసిన కషాయాలను తీసుకోవడం ప్రారంభించారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం ఇవి ఉత్తమ మార్గం. అదే సమయంలో వీటిని పరిమితంగా తీసుకోవడం కూడా అవసరం.
  • ఉసిరి కొవిడ్ చికిత్సలో మంచి ఔషధంలా పని చేస్తుంది. ఇందులోని పోషకాలు ఇమ్యూనిటీని పెంచుతాయి. కరోనా లాంటి ప్రమాదకర వైరస్‌ల బారి నుంచి రక్షణ కల్పిస్తాయి.
  • గత కొన్ని సంవత్సరాలుగా, ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాధాన్యం బాగా పెరిగిపోయింది. మీరు కూడా ఈ దినచర్యను క్రమం తప్పకుండా పాటిస్తే కరోనా, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా దూరంగా ఉంటాయి.
  • మీరు విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి, కానీ వాటి పరిమాణంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించండి. శీతాకాలంలో విటమిన్ సి ఎక్కువగా లభించే నారింజ పండ్లను బాగా తీసుకోవాలి. ఇవి మార్కెట్లో సులభంగా లభిస్తాయి. రుచిలో అద్భుతంగా ఉండే ఈ పండ్లను పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

ఇవి కూడా చదవండి