Shah Rukh Khan: ‘బాలీవుడ్ బాద్షా’కు మరో అరుదైన గౌరవం.. ఆ జాబితాలో ఒకే ఒక్క భారతీయుడు..

బాలీవుడ్ అగ్రనటులలో ఒకరైన షారుఖ్ ఖాన్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ బ్రిటీష్ మ్యాగజైన్ రూపొందించిన 50 మంది అత్యుత్తమ నటుల అంతర్జాతీయ జాబితాలో ఉన్న ఒకే ఒక్క భారతీయుడిగా..

Shah Rukh Khan: ‘బాలీవుడ్ బాద్షా’కు మరో అరుదైన గౌరవం.. ఆ జాబితాలో ఒకే ఒక్క భారతీయుడు..
Shah Rukh Khan
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 21, 2022 | 10:46 AM

బాలీవుడ్ అగ్రనటులలో ఒకరైన షారుఖ్ ఖాన్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ బ్రిటీష్ మ్యాగజిన్ రూపొందించిన 50 మంది అత్యుత్తమ నటుల అంతర్జాతీయ జాబితాలో ఉన్న ఒకే ఒక్క భారతీయుడిగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నిలిచాడు. హాలీవుడ్‌లోని డెంజెల్ వాషింగ్టన్, టామ్ హాంక్స్, ఆంథోనీ మార్లన్ బ్రాండో, మెరిల్ స్ట్రీప్, జాక్ నికల్సన్ తదితర దిగ్గజ నటుల సరసన షారుఖ్ ఖాన్ కూడా చేరాడు. బ్రిటీష్‌కు చెందిన ప్రఖ్యాత ‘ఎంపైర్ మ్యాగజిన్’ 50 మంది అత్యుత్తమ నటుల అంతర్జాతీయ జాబితాను మంగళవారం  తన అధికారిక వెబ్‌సైట్ ప్రచురించింది. ఇక ఈ 50 మందిలో భారత్ నుంచి కేవలం బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ మాత్రమే ఉన్నాడు.

ఈ సందర్భంగా ఎంపైర్ మ్యాగజిన్ షారుఖ్ ఖాన్ గురించి ‘ ప్రముఖ పాత్రలు: దేవదాస్ ముఖర్జీ ( దేవదాస్ ), రిజ్వాన్ ఖాన్ ( మై నేమ్ ఈజ్ ఖాన్ ), రాహుల్ ఖన్నా ( కుచ్ కుచ్ హోతా హై ), మోహన్ భార్గవ ( స్వదేస్).. ప్రతిరోజు జీవితం మనల్ని కొంచెం చంపుతుంది. కానీ బాంబు ఒక్కసారి మాత్రమే నిన్ను చంపుతుంది.( జబ్ తక్ హై జాన్ )’’ అంటూ పేర్కొంది. ఇంకా  ‘‘బద్దలు కొట్టలేని రికార్డులతో,కోట్లాది మంది అభిమానులను కలిగిన నటుడు. విపరీతమైన చరిష్మా, నటనలో సంపూర్ణ నైపుణ్యం లేకుండా అలా చేయలేరు. దాదాపు ప్రతి పాత్రలో కంఫర్ట్‌గా నటించే షారుఖ్ చేయలేని పాత్రే లేద’’ని ఎంపైర్ మ్యాగజైన్ తెలిపింది.

ఇవి కూడా చదవండి

కాగా వచ్చే ఏడాది జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న యాక్షన్ చిత్రం ‘పఠాన్’లో షారుఖ్ ఖాన్ తన అభిమానులను అలరించనున్నాడు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో షారుఖ్‌తో పాటు జాన్ అబ్రహం, దీపికా పదుకొనే కూడా ప్రధాన పాత్రలలో నటించారు. ఇవే కాక అట్లీతో యాక్షన్-ఎంటర్టైనర్ ‘జవాన్(జూన్ 2, 2023న విడుదల)’, రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రానున్న పాన్ ఇండియా మూవీ ‘డుంకీ(డిసెంబర్ 2023లో విడుదల)’లో కూడా షారుఖ్ ఖాన్ కనిపించనున్నారు. ఇక డుంకీ మూవీలో షారుఖ్‌తో పాటు తాప్సీ పన్ను, విక్కీ కౌషల్ కూడా సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..