- Telugu News Photo Gallery Kannada serial actress Shwetha Prasad returned from Saudi after 6 days tour as she invited by Saudi Arabia tourism department
Shwetha Prasad: సౌదీ టూర్ నుంచి తిరిగి వచ్చిన కన్నడ సీరియల్ నటి.. అభిమానులతో తన ఫోటోలను పంచుకున్న శ్వేతా ప్రసాద్..
సౌదీ అరేబియాలో తన ఆరు రోజుల పర్యటన ముగించుకుని కన్నడ నటి శ్వేత ప్రసాద్ తిరిగి వచ్చింది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది ఈ నటి..
Updated on: Dec 21, 2022 | 7:18 AM

‘శ్రీరస్తు శుభమస్తు’, ‘రాధా రమణ’ సీరియల్స్ ఫేమ్ కన్నడ నటి శ్వేతా ప్రసాద్ 'కళబెట్టాడ దొరోడెకొరారు(Kal Bettada Darodekoraru)' సినిమాతో వెండితెరపై కూడా మెరిసింది. ఇటీవలే సౌదీ అరేబియా టూరిజం అథారిటీ ఆహ్వానం మేరకు ఆ దేశం వెళ్లిన శ్వేత తన పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చింది.

సౌదీ అరేబియా టూరిజం అథారిటీ తమ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వివిధ దేశాలకు చెందిన ప్రముఖులను తమ దేశానికి ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలోనే కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి ఆహ్వానం అందుకున్న తొలి నటి శ్వేతా ప్రసాద్.

అహ్వానం మేరకు సౌదీ అరేబియా వెళ్లిన శ్వేత ఆరు రోజుల పర్యటన ముగించుకుని తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. ‘ఈ ప్రయాణం నాకు కొత్త అనుభూతినిచ్చింది’ అమె తెలిపింది.

‘ఆహారం, ఆతిథ్యం అన్నీ చాలా బాగున్నాయి. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ఆ దేశంలోని అధికారులు కొత్త మార్గాలను కనుగొన్నారు. అక్కడి ప్రజలకు భారతీయులంటే ప్రత్యేకమైన ప్రేమ ఉంద’ని శ్వేతా ప్రసాద్ అభిప్రాయపడింది.

సీరియళ్లకు ఈ మధ్య కాస్త విరామం ఇచ్చిన శ్వేతా ప్రసాద్ ప్రస్తుతం ‘అరిహ’ అనే సినిమాలో నటిస్తోంది. ఇక ఆమెకు సంబంధించిన ఈ కొత్త ఫోటోలు అభిమానుల సర్కిల్‌లో వైరల్‌గా మారాయి.





























