- Telugu News Photo Gallery Cricket photos INDW vs AUSW heather graham took hat trick against india women in mumbai becomes 2nd australian women after megan schut
2 ఓవర్లు, 8 పరుగులు.. హ్యాట్రిక్‌తో 4 వికెట్లు.. ముంబైలో టీమిండియాకు చుక్కలు.. చరిత్ర సృష్టించిన బౌలర్ ఎవరంటే?
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణి భారత జట్టు ఘోర పరాజయానికి కారణమైంది.ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించింది. టీ20 ఇంటర్నేషనల్‌లో తన దేశానికి చెందిన రెండవ ప్లేయర్‌గా నిలిచింది.
Updated on: Dec 21, 2022 | 6:35 AM

ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా జరిగిన ఐదో, చివరి టీ20లో భారత జట్టుపై ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు విజయం సాధించింది. ఈ విజయంలో ఆస్ట్రేలియా బౌలర్ చరిత్ర సృష్టించింది. ఈ ప్లేయర్ పేరు హీథర్ గ్రాహం.

ఈ మ్యాచ్‌లో గ్రాహం హ్యాట్రిక్ సాధించింది. దీంతో టీ20 ఇంటర్నేషనల్‌లో హ్యాట్రిక్ సాధించిన ఆస్ట్రేలియా రెండో మహిళా బౌలర్‌గా రికార్డు సృష్టించింది. అంతకు ముందు మేగాన్ షట్ హ్యాట్రిక్ సాధించింది.

రెండు ఓవర్లలో గ్రాహమ్ ఈ హ్యాట్రిక్ సాధించింది. 13వ ఓవర్ వేసిన గ్రాహం ఐదు, ఆరో బంతుల్లో వికెట్లు పడగొట్టింది. దేవికా వైద్య (11), రాధా యాదవ్ (0)ను పెవిలియన్ చేర్చింది. ఆ తర్వాత 20వ ఓవర్ తొలి బంతికి రేణుకా సింగ్ (2)ను అవుట్ చేసి హ్యాట్రిక్ పూర్తి చేసింది.

ఈ ఓవర్ చివరి బంతికి వికెట్ కూడా పడగొట్టింది. ఈ ఓవర్ చివరి బంతికి దీప్తిని గ్రాహం అవుట్ చేసింది. గ్రాహం రెండు ఓవర్లు బౌలింగ్ చేసి ఎనిమిది పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది.

ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారత్‌పై హ్యాట్రిక్ సాధించారు. ఈ ఇద్దరూ ముంబైలోనే హ్యాట్రిక్ చేయడం విశేషం.




