- Telugu News Photo Gallery Cricket photos Indian Cricket Team Captain Rohit Sharma Ends a Year 2022 Without Scoring a Hundred Since 2013 Know the Details
Rohit Sharma: రోహిత్ శర్మ 9 సంవత్సరాల పరంపరకు బ్రేక్.. ఈ ఏడాది ఒక్కటి కూడా లేదు..
రోహిత్ శర్మ ఈ ఏడాది బ్యాడ్ ఫర్మార్మెన్స్‌తో ఇబ్బంది పడుతున్నాడు. ఫలితంగా అతనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో అతన్ని గాయాలు సైతం వేధిస్తున్నాయి. ఈ గాయాల కారణంగా తాజాగా జరుగుతున్న బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌కు దూరం అయ్యాడు.
Updated on: Dec 21, 2022 | 5:19 AM

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌కు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. బొటనవేలు గాయం కారణంగా మూడవ వన్డే, మొదటి టెస్ట్ మ్యాచ్‌కు దూరయ్యాడు. ఇప్పుడు రెండో టెస్ట్‌కు కూడా అందుబాటులో లేడు. దీని ఫలితంగా 2013 నుంచి రోహిత్ ట్రాక్ రికార్డ్‌కు బ్రేక్ పడినట్లయ్యింది. ఆ ట్రాక్ రికార్డ్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

తుఫాన్ బ్యాటింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా పేరు గాలించిన బ్యాటర్ కెప్టెన్ రోహిత్ శర్మ. కానీ, ఈ సంవత్సరం అంటే 2022లో రోహిత్ శర్మ కనీసం ఒక్కటంటే ఒక్క సెంచరీ కూడా చేయలేదు.

2013 తర్వాత ఏడాదిలో రోహిత్ ఒక్క సెంచరీ కూడా చేయకపోవడం ఇదే తొలిసారి. అంటే 9 ఏళ్ల తర్వాత.. ఈ ఏడాదిలోనే తొలిసారి రోహిత్ సెంచరీ నమోదు కాలేదు.

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ బొటనవేలికి గాయం కావడంతో నిష్క్రమించాడు. ఆ మ్యాచ్‌లో ఎలాగోలా బ్యాటింగ్ చేసి 27 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టినా జట్టును గెలిపించలేకపోయాడు.

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ బొటనవేలికి గాయం కావడంతో నిష్క్రమించాడు. ఆ మ్యాచ్‌లో ఎలాగోలా బ్యాటింగ్ చేసి 27 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టినా జట్టును గెలిపించలేకపోయాడు.




