- Telugu News Photo Gallery Cricket photos Ipl mini auction 2023 from aaron finch to chris gayle 9 star players players not participate in ipl mini auction check full list here
IPL Auction 2023: మినీ వేలం నుంచి తప్పుకున్న స్టార్ ప్లేయర్లు వీరే.. లిస్టులో 9మంది..
ఐపీఎల్ 2023 కోసం ఆటగాళ్ల వేలం డిసెంబర్ 23న నిర్వహించనున్నారు. ఆరోన్ ఫించ్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, క్రిస్ గేల్ వంటి వెటరన్లు ఈ వేలంలో కనిపించరు.
Updated on: Dec 21, 2022 | 2:42 PM

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకరైన క్రిస్ గేల్ వేలంలో పాల్గొనడంలేదు. గత సీజన్‌లో జరిగిన ఐపీఎల్ వేలంలో కూడా గేల్ తన పేరును చేర్చలేదు.

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకరైన క్రిస్ గేల్ వేలంలో పాల్గొనడంలేదు. గత సీజన్‌లో జరిగిన ఐపీఎల్ వేలంలో కూడా గేల్ తన పేరును చేర్చలేదు.

క్రిస్ గేల్‌తోపాటు ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా ఈసారి వేలంలో భాగం కావడం లేదు. గత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో ఫించ్ సభ్యుడిగా ఉన్నాడు.

అదే సమయంలో, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఈసారి వేలానికి నమోదు చేసుకోలేదు. ఐపీఎల్‌లో పదేళ్లపాటు ఆడిన అనుభవం ఉంది.

స్మిత్ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, పూణె వారియర్స్, రైజింగ్ పూణె సూపర్‌జెయింట్‌ల తరపున ఆడాడు. ఐపీఎల్‌లో 2485 పరుగులు నమోదు చేశాడు.

వీరితో పాటు, అలెక్స్ హేల్స్, సామ్ బిల్లింగ్స్, మార్నస్ లాబుషాగ్నే, క్రిస్ వోక్స్, మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్ కూడా IPL 2023 వేలంలో చేరలేదు.





























