- Telugu News Photo Gallery Cricket photos Ajinkya Rahane slams double century against Hyderabad in Ranji Trophy
ఏడాది క్రితం జట్టు నుంచి తొలగింపు.. కట్ చేస్తే రెండు డబుల్ సెంచరీతో దిమ్మతిరిగే సమాధానమిచ్చిన సీనియర్ ప్లేయర్
14 జనవరి 2022... ఇది అజింక్యా రహానే టీమ్ ఇండియా తరపున ఆడిన చివరి మ్యాచ్ తేదీ. సెంచూరియన్ మైదానంలో టీమిండియా తరఫున చివరి మ్యాచ్ ఆడిన రహానే పేలవ ప్రదర్శనతో టీమ్ ఇండియాకు దూరమయ్యాడు. అయితే ఇప్పుడు రంజీ ట్రోఫీలో ముంబయి జట్టుకు కెప్టెన్‌గా ఉన్న అజింక్య రహానే మళ్లీ అద్భుతమైన ఫామ్‌లోకి వచ్చి డబుల్ సెంచరీ సాధించాడు.
Updated on: Dec 21, 2022 | 7:03 PM

14 జనవరి 2022... ఇది అజింక్యా రహానే టీమ్ ఇండియా తరపున ఆడిన చివరి మ్యాచ్ తేదీ. సెంచూరియన్ మైదానంలో టీమిండియా తరఫున చివరి మ్యాచ్ ఆడిన రహానే పేలవ ప్రదర్శనతో టీమ్ ఇండియాకు దూరమయ్యాడు. అయితే ఇప్పుడు రంజీ ట్రోఫీలో ముంబయి జట్టుకు కెప్టెన్‌గా ఉన్న అజింక్య రహానే మళ్లీ అద్భుతమైన ఫామ్‌లోకి వచ్చి డబుల్ సెంచరీ సాధించాడు.

ముంబైలోని బీకేసీ అకాడమీలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ అజింక్య రహానే కేవలం 261 బంతుల్లో 78కి పైగా స్ట్రైక్ రేట్‌తో 204 పరుగులు చేశాడు.

Ajinkya Rahane

సెప్టెంబరులో దులీప్ ట్రోఫీలో భాగంగా వెస్ట్‌జోన్ తరఫున బరిలోకి దిగిన రహానే.. నార్త్ జోన్‌తో మ్యాచ్‌లో 207 పరుగులు చేశాడు.

34 ఏళ్ల రహానే టీమ్ ఇండియాలో స్థానం కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఈ డబుల్ సెంచరీతోనైనా సెలెక్టర్లు రహానేపై దృష్టా సారిస్తారో లేదో మరి