- Telugu News Photo Gallery Cinema photos Nayanthara to Kajal Aggarwal: These Tollywood celebrities Became Mothers in 2022
Nayanthara to Kajal Aggarwal: ఈ ఏడాది ‘అమ్మ’ గా ప్రమోషన్ పొందిన తెలుగు హీరోయిన్లు వీరే..
టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు దంపతులకు ఈ ఏడాది ఏప్రిల్ 19న మగబిడ్డకు జన్మనిచ్చారు. వీరి వివాహం..
Updated on: Dec 21, 2022 | 11:36 AM

టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు దంపతులకు ఈ ఏడాది ఏప్రిల్ 19న మగబిడ్డకు జన్మనిచ్చారు. వీరి వివాహం అక్టోబర్ 2020లో ముంబైలో జరిగింది.

లేడీ సూపర్‌స్టార్ నయనతారా, ఫిల్మ్‌మేకర్ విగ్నేష్ శివన్ దంపతులు కవలలకు సరోగసీ ద్వారా ఈ ఏడాది అక్టోబర్‌లో జన్మనిచ్చారు. జూన్ 2022లో వీరి వివాహం జరిగింది.

గాయని చిన్మయి, నటుడు రాహుల్ రవింద్రన్ దంపతులు కవలలకు జన్మనిచ్చారు. పాపకు ద్రిప్తా, బాబుకు శర్వాస్ అని పేర్లు పెట్టారు.

నటి ప్రణీత సుభాష్, వ్యాపారవేత్త నితిన్ రాజు దంపతులకు ఈ ఏడాది జూన్‌లో పాపకు జన్మనిచ్చారు. వీరి వివాహం 2021, మే 30న జరిగింది.

సూపర్‌స్టార్ రజనీకాంత్ చిన్న కుమార్తె అయిన సౌందర్య రజినీకాంత్, విశాగన్ దంపతులకు సెప్టెంబర్ 11న మగబిడ్డకు జన్మనిచ్చారు. సౌందర్యకి రజనీకాంత్‌కు మొదట బిజినెస్ మ్యాన్ అశ్విన్ కుమార్‌తో వివాహం జరిగింది. వీరికి వేద్ కృష్ణ (మొదటి సంతానం) జన్మించాడు. ఆ తర్వాత అశ్విన్‌కు విడాకులిచ్చి, 2019లో వ్యాపారవేత్త విషగన్ వనంగమూడిని సెకండ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే.




