Covid 19: ఏపీలో కరోనా హెచ్చరికలు.. కేసులపై దృష్టి సారించిన అధికారులు.. కారణం ఏమిటంటే..
ప్రపంచదేశాలలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ కేంద్ర ఆరోగ్య శాఖ చేసిన కరోనా హెచ్చరికలతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో నమోదవుతోన్న కోవిడ్ కేసులపై రాష్ట్ర అధికారులు..
ప్రపంచదేశాలలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన కరోనా హెచ్చరికలతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో నమోదవుతోన్న కోవిడ్ 19 కేసులపై రాష్ట్ర అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్ర జారీ చేసిన ఆదేశాలు, సూచనలను పాటిస్తూ.. నమోదయిన కేసులపై అనుమానం ఉన్నవాటిని జీనోమ్ సీక్వేన్సీకి పంపుతున్నారు. చాలా మందిని పోస్ట్ కోవిడ్ సమస్యలు వేధిస్తున్నాయని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మొదటి కేసు నమోదు అయిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 23.5 లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. వారిలో సుమారు 14,733 మంది కరోనా కారణంగా మరణించారు.
అయితే మన పక్కనే ఉన్న చైనా, ఇంకా బ్రెజిల్, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాలలో కరోనా కేసులు పెరుగున్న నేపథ్యంలో కేంద్రం కోవిడ్ హెచ్చరికలను జారీ చేసింది. ఈ మేరకు కరోనాపై దృష్టి సారించాలని దేశంలోని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు(డిసెంబర్ 21) ఉదయం 11 గంటలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ దేశంలోని కరోనా పరిస్థితులపై సమీక్షించనున్నారు.
కాగా, దేశంలో ఆరోగ్య వ్యవస్థ పటిష్టంగా ఉందని, దేశ ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని నీతి అయోగ్ కోవిడ్ 19 వర్కింగ్ చైర్మన్ ఎన్‌కే అరోరా తెలిపారు. ఇంకా మన దేశంలో రోగనిరోధక శక్తి కలిగినవారే ఎక్కువగా ఉన్నారని, ఒక వేళ కరోనా వ్యాపించిన ప్రభుత్వం దగ్గర ప్రభావవంతమైన టీకాలు ఉన్నాయని పేర్కొన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..