PM Modi – YS Jagan: సీఎం జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. ఆయురారోగ్యాలతో..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారంతో 50వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు, రాజకీయ నాయకుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారంతో 50వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు, రాజకీయ నాయకుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ట్విట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు.. ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు పొందాలని కోరుకుంటున్నాను.’’ అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
ప్రధాని మోడీ చేసిన ట్వీట్..
Best wishes to Andhra Pradesh CM Shri @ysjagan Garu on his birthday. May he be blessed with a long and healthy life.
— Narendra Modi (@narendramodi) December 21, 2022
సీఎం జగన్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Hearty Greetings to Hon’ble Chief Minister of Andhra Pradesh Thiru. @ysjagan on his 50th Birthday.
Wishing you peace, good health and happiness always on this special day.
— M.K.Stalin (@mkstalin) December 21, 2022
సీఎం జగన్ బర్త్ డే సందర్భంగా రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు సైతం బర్త్‌డే విషెస్ తెలిపారు. పలువురు వైసీపీ నేతలు, సినీ ప్రముఖులు కూడా శుభాకాంక్షలుతెలిపారు.
కాగా.. సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఢిల్లీలోని ఏపీ భవన్‌లో వైసీపీ ఎంపీలు కేక్ కట్ చేశారు. విద్యార్థులతో కలిసి ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో సీఎం జగన్ ది ప్రత్యేక స్థానం అంటూ కొనియాడారు.
ఏపీ వ్యాప్తంగా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..
