Viral Video: ఈ స్టిక్‌లో దాగుంది ఓ కీటకం.. ఇది నమ్మలేని నిజం.. కళ్లను మాయ చేసే వింత..
ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో ప్రాణులు సంచరిస్తుంటాయి. అందులో కొన్ని మన కళ్లకు కనిపిస్తే..
ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో ప్రాణులు సంచరిస్తుంటాయి. అందులో కొన్ని మన కళ్లకు కనిపిస్తే.. మరికొన్ని మన కళ్లనే మాయ చేస్తాయి. అలాంటి కీటకాలకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైతేనే.. వాటిని చూసి మనమూ ఆశ్చర్యపోతాం. ఈ క్రమంలోనే ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కాస్వన్ తాజాగా షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆయన ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో మీకు ఓ కర్ర కనిపిస్తుంది. దాన్ని ఎవరో కదపగానే అది కదులుతుండటం మీరూ చూడొచ్చు.
ఇక ఈ వీడియో చివరిలో స్టిక్‌లో నుంచి ఓ కీటకం బయటకు రావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. స్టిక్‌లో కలిసిపోయిన కీటకం తెలివిగా ఇతర కీటకాల నుంచి తనకు తాను కాపాడుకుంది. ‘నమ్మలేని విధంగా మభ్యపెట్టడం.. ఇదే వారి సొంత రక్షణ వ్యవస్ధ’ అనేది వీడియోకు క్యాప్షన్‌గా పెట్టారు ఐఎఫ్ఎస్ అధికారి. కాగా, ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వస్తుండగా.. పెద్ద సంఖ్యలో నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.
The unbelievable camouflage. This is their own defence mechanism. pic.twitter.com/52oHaozIw6
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) December 20, 2022