Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny dance: ఇదేం డ్యాన్స్‌రా బాబు.. నవ్వలేక పడిపోయేలా చేస్తున్నాడు.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..

ఇటీవలి కాలంలో డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే వస్తున్నాయి. వాటిలో కొన్ని మనకు బాగా నచ్చేవి అయితే మరికొన్ని పడిపడి నవ్వించే ఫన్నీ డ్యాన్స్ వీడియోలు. మరి ముఖ్యంగా చెప్పుకోవలసినది ఏమంటే ప్రస్తుత కాలంలో పెళ్లి వేడుకలలో డ్యాన్స్ అనేది తప్పనిసరి అయిపోయింది. ఈ క్రమంలోనే పెళ్లి సందర్భంగా చేసే డ్యాన్స్‌లకు సంబంధించిన వీడియోలను మనం సోషల్ మీడియాలో చూస్తునే ఉన్నాం. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను […]

Funny dance: ఇదేం డ్యాన్స్‌రా బాబు.. నవ్వలేక పడిపోయేలా చేస్తున్నాడు.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..
Boy Funny Dance At Wedding
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 21, 2022 | 11:47 AM

ఇటీవలి కాలంలో డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే వస్తున్నాయి. వాటిలో కొన్ని మనకు బాగా నచ్చేవి అయితే మరికొన్ని పడిపడి నవ్వించే ఫన్నీ డ్యాన్స్ వీడియోలు. మరి ముఖ్యంగా చెప్పుకోవలసినది ఏమంటే ప్రస్తుత కాలంలో పెళ్లి వేడుకలలో డ్యాన్స్ అనేది తప్పనిసరి అయిపోయింది. ఈ క్రమంలోనే పెళ్లి సందర్భంగా చేసే డ్యాన్స్‌లకు సంబంధించిన వీడియోలను మనం సోషల్ మీడియాలో చూస్తునే ఉన్నాం. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసినవారు నవ్వకుండా ఉండలేరు. మీరు ఇప్పటి వరకు నాగిన్ డ్యాన్స్చ ముర్గా డ్యాన్స్ చూసి ఉంటారు. కానీ ఇప్పుడు మీరు కొత్త రకం డ్యాన్స్ చూడబోతున్నారు.

ashikali2158 అనే ఇన్‌స్టా ఐడీ నుంచి పోస్ట్ అయిన ఈ ఫన్నీ డ్యాన్స్ వీడియోలో..  ఒక యువకుడు వింత వింత స్టెప్పులతో డ్యాన్స్ వేయడాన్ని మనం చూడవచ్చు. ఇక అతను ఇచ్చే హావభావాలను చూసినవారు ఎవరైనా సరే ఆశ్యర్యపోకుండా ఉండలేరు. అంతేకాకుండా పడిపడి నవ్వేసుకుంటారు. ఈ వీడియోను చూస్తుంటే మ్యారేజ్ ఫంక్షన్‌లో ఓ మహిళా డ్యాన్సర్‌ని అతన్ని డ్యాన్స్ చేసేందుకు ఆహ్వానించినట్లుగా ఉంది. ఆహ్వానం అందడమే ఆలస్యం అన్నట్లుగా ఆ యువకుడు తన డ్యాన్స్‌తో అందరినీ అలరించాడు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ఫన్నీ డ్యాన్స్ వీడియో..

View this post on Instagram

A post shared by ashik ali (@ashikali2158)

కాగా, ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 50 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించగా, దాదాపు 2 లక్షల 45 వేల మందికి పైగా లైక్ చేసారు. ఇంకా నెటిజన్లు వారి వారి  స్పందనలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తున్నారు. వారిలో ఒక నెటిజన్ ‘ప్రతిభకు లోటు లేదు బ్రో’ అని రాయగా,  ‘మైఖేల్ జాక్సన్ అల్ట్రా ప్రో మాక్స్ వెర్షన్’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..