AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: వామ్మో..! దె.. దె.. దెయ్యం..లగెత్తండ్రోయ్‌..! నెట్టింట వైరల్‌ అవుతోన్న పొగ దెయ్యం వీడియో

దెయ్యాలున్నాయని మీలో ఎంతమంది నమ్ముతారు. అసలు దెయ్యాలే లేవని అనుకుంటున్నారా? దెయ్యం లేదు ఏం లేదు అంతా భ్రమ అని కొట్టి పారేస్తున్నారా? ఒక వేళ ఉంటే అది ఏ రూపంలో ఉంటుంది? ఎలా ఉంటుంది? వంటి..

Watch Video: వామ్మో..! దె.. దె.. దెయ్యం..లగెత్తండ్రోయ్‌..! నెట్టింట వైరల్‌ అవుతోన్న పొగ దెయ్యం వీడియో
Demonic Ghost
Srilakshmi C
|

Updated on: Dec 21, 2022 | 1:10 PM

Share

దెయ్యాలున్నాయని మీలో ఎంతమంది నమ్ముతారు. అసలు దెయ్యాలే లేవని అనుకుంటున్నారా? దెయ్యం లేదు ఏం లేదు అంతా భ్రమ అని కొట్టి పారేస్తున్నారా? ఒక వేళ ఉంటే అది ఏ రూపంలో ఉంటుంది? ఎలా ఉంటుంది? వంటి సందేహాలు ఎప్పుడైన కలిగాయా.. ఐతే మీరు ఈ వీడియో చూడాల్సిందే. రాత్రి పూట సరదాగా వాకింగ్‌కు వెళ్లిన ఈ జంటకు అనుకోని సంఘటన ఎదురైంది. ఉన్నట్టుంది వింత ఆకారాలు కన్పించడంతో తమకళ్లను తామే నమ్మలేక పోయారు. ఆ తర్వాత వాస్తవం గ్రహించి వెంటనే సెల్‌ ఫోన్‌తో వీడియో తీశారు. నమ్మశక్యంకాకపోతే మీరూ ఓ లుక్కేసుకోండి..

యూకేకు చెందిన హన్నా రోవెట్ (52), ఆమె భర్త డేవ్ తమ ఇంటి సమీపంలోని క్లంబర్ పార్క్‌లో రాత్రి పూట తమ పెట్‌ డాగ్‌తో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో వారికి పొగల రూపంలో కొన్ని వింత ఆకారాలు కన్పించాయి. ఈ కదులుతున్న పొగ ఆకారాలను హన్నా తన సెల్‌ ఫోన్‌లో వీడియో సైతం తీశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పొగ ఆకారాలు స్పష్టంగా కనిపించనప్పటికీ దానికి వెనుక భాగంలో పొడవాటి తోకతో నేలపై నడుచుకుంటూ వెళ్లడం ఈ వీడియోలో కనిపిస్తుంది. హన్నా మీడియాతో మాట్లాడుతూ..

ఇవి కూడా చదవండి

‘తొలుత చూడగానే అది కుక్క అని భావించాను. మా పెట్‌ డాగ్‌ ఏమోనని అనుకున్నాము. కానీ తరచి చూడగా మానవ రూపంలో ఆ ఆకారం ఉంది. అది మా పెంపుడుకుక్క కాదని నిర్ధారించుకున్న తర్వాత నా సెల్‌ ఫోన్‌తో వీడియో తీశాను. దానికి పొడవాటి అవయవాలతో కదులుతున్న పొగ మాదిరి ఉంది. వెంటనే టార్చ్‌ లైట్‌తో దానిని వీడియో తీస్తూ వెంబడించాను. నాకు భయం అనిపించలేదు. ఇలాంటివి ఎవరికైనా చెబితే నవ్వుతారు. అందుకే నేను చూసిన దానిని వీడియో తీశాను’ అని హన్నా మీడియాకు వివరించింది. ఆమె ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. అదే మనమైతే వెనక్కి చూడకుండా పరుగులంకించుకునే వారం కదా! మీరేమంటారు..

మరిన్ని తాజా వైరల్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు
ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు
రోజూ అవే పూరీలు ఏం తింటారు ఓ సారి ఇలా ట్రై చేయండి! హెల్దీ, టేస్టీ
రోజూ అవే పూరీలు ఏం తింటారు ఓ సారి ఇలా ట్రై చేయండి! హెల్దీ, టేస్టీ