AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఇది కదా మానవత్వమంటే..! బిడ్డల ఆకలి తీర్చడానికి రూ.500లు సాయం కోరితే ఏకంగా రూ.55 లక్షలు..

భర్తను కోల్పోయిన, తన పిల్లల ఆకలి తీర్చేందుకు డబ్బులేక కడుపేదరికంలో మగ్గిపోతున్న ఓ మహిళ సాయం కావాలంటూ సోషల్‌ మీడియాలో అభ్యర్థించింది. దీంతో ఊహించని రీతిలో..

Viral News: ఇది కదా మానవత్వమంటే..! బిడ్డల ఆకలి తీర్చడానికి రూ.500లు సాయం కోరితే ఏకంగా రూ.55 లక్షలు..
Crowdfunding Campaign
Srilakshmi C
|

Updated on: Dec 21, 2022 | 8:57 AM

Share

భర్తను కోల్పోయిన, తన పిల్లల ఆకలి తీర్చేందుకు డబ్బులేక కడుపేదరికంలో మగ్గిపోతున్న ఓ మహిళ సాయం కావాలంటూ సోషల్‌ మీడియాలో అభ్యర్థించింది. దీంతో ఊహించని రీతిలో ఆమెకు విరాళాల రూపంలో లక్షలాది రూపాయల సాయం అందింది. వివరాల్లోకెళ్తే..

కేరళకు చెందిన సుభద్ర (46) భర్త ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ముగ్గురు బిడ్డల తల్లైన సుభద్రకు పూట గడవడమే కష్టంగా మారింది. చిన్న కొడుక్కి సెలబ్రల్ పాల్సి వ్యాధి ఉండటంతో ఎల్లప్పుడూ దగ్గరే ఉండవల్సిన పరిస్థితి. దీంతో కుటుంబ జీవనానికి ఉపాధిలేక తల్లడిల్లిపోయింది. ఈ క్రమంలో గత శుక్రవారం (16) తన రెండో కొడుకు చదివే స్థానిక పాఠశాల హిందీ టీచర్ గిరిజ హరికుమార్ వద్దకు వెళ్లి రూ.500లు సాయం కోరింది. ఆమె దీనపరిస్థితిని చూసి చలించిపోయిన టీచర్‌ గిరిజ హరికుమార్ రూ.1000లు ఇచ్చారు. అంతటితో ఆగకుండా ఫేస్‌ బుక్‌లో క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ ప్రారంభించారు. తోచినంత సాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని తన పోస్టులో కోరారు. అలాగే ఆ పోస్టులో సుభద్ర బ్యాంకు అకౌంట్ వివరాలను కూడా జత చేయడంతో.. దాతలు అందించే డబ్బు నేరుగా సుభద్ర అకౌంట్లోకి చేరాయి.

Teacher And Kerala Woman

Teacher And Kerala Woman

దీంతో కేవలం రెండు రోజుల వ్యవధిలోనే అంటే డిసెంబర్‌ 18 నాటికి రూ.55 లక్షలు సమకూరాయి. దీంతో టీచర్‌ చేసిన సాయం మర్చిపోలేనిదని, దిక్కులేని తన కుటుంబానికి చుక్కానిలా దారి చూపించిన దేవత అంటూ సుభద్ర మీడియాకు వివరించింది.

ఇవి కూడా చదవండి

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు