IT Notice: దినసరి కూలీకి దిమ్మతిరిగే షాక్! ఏకంగా రూ.14 కోట్ల ఆదాయపు పన్ను.. చివరికి ఏం జరిగిందంటే..
ఐటీ శాఖ లీలలు మామూలుగా లేవు.. కూలి పనులు చేసుకుంటూ పొట్టపోసుకునే వ్యక్తకి ఏకంగా రూ.14 కోట్ల రూపాయల ఆదాయపు పన్ను విధించారు. పైగా పన్ను కట్టలేదంటూ..
ఐటీ శాఖ లీలలు మామూలుగా లేవు.. కూలి పనులు చేసుకుంటూ పొట్టపోసుకునే వ్యక్తకి ఏకంగా రూ.14 కోట్ల రూపాయల ఆదాయపు పన్ను విధించారు. పైగా పన్ను కట్టలేదంటూ నోటీసులు సైతం జారీ చేసి, పన్ను కట్టవల్సిందేనంటూ ఇంటి కొచ్చారు. కాయాకష్టం చేసుకుంటూ పదోపరకో సంపాదించే సదరు కూలీ నోటీసులు చూసి లబోదిబోమన్నాడు. వివరాల్లోకెళ్తే..
బిహార్‌లోని రోహ్తాస్‌కు చెందిన మనోజ్ యాదవ్ అనే వ్యక్తి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎండెనకా.. వానెనకా శ్రమిస్తే నెలకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు ఆదాయం వస్తుంది. ఐతే అతని పేరుపై పలు వ్యాపారాలున్నాయని, వాటిపై రూ.14 కోట్లు పన్ను కట్టాలని ఐటీ శాఖ మనోజ్‌కు సోమవారం (డిసెంబర్ 19) నోటీసులు జారీ చేసింది. నోటీసులను చూసి షాక్‌కు గురైన మనోజ్ తాను ఏ వ్యాపారాలు చేయడంలేదని, కూలిపనులు చేసుకునే బతికే తనకు అన్ని కోట్ల ఆదాయపన్ను రావడం ఏంటో అర్థంకావడంలేదని అధికారులకు విన్నవించాడు. తనకున్నదంతా అమ్మినా అంతడబ్బుకట్టలేనని లబోదిబోమన్నాడు. కూలీ పనుల నిమిత్తం మనోజ్ ఢిల్లీ ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటాడని, అక్కడ కాంట్రాక్ట్ పనుల కోసం పాన్‌కార్డు, ఆధార్ కార్డు ఇస్తుండేవాడని అధికారులకు తెలిపాడు. ఎవరో వీటి ఆధారంగా ఫ్రాడ్‌కుపాల్పడి ఉంటారని విన్నవించాడు. దీంతో ఇన్‌కాంట్యాక్స్ అధికారుల ధర్యాప్తులో మనోజ్ ఎటువంటి మోసాలకు పాల్పడటం లేదని నిర్ధారించి వెనుదిరగడంతో కథ సుఖాంతం అయ్యింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.