AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Prime Gaming service: అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్ర్కైబర్లకు అదిరిపోయే ఆఫర్‌.. ఉచితంగా మరో సర్వీస్‌!

ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌ ఎట్టకేలకు ప్రైమ్‌ గేమింగ్‌ సర్వీస్‌ను భారత్‌లో ప్రారంభించింది. అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్ర్కైబర్లు ఈ సర్వీస్‌ను ఉచితంగా పొందొచ్చని..

Amazon Prime Gaming service: అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్ర్కైబర్లకు అదిరిపోయే ఆఫర్‌.. ఉచితంగా మరో సర్వీస్‌!
Amazon Prime Gaming Service
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 21, 2022 | 6:50 AM

ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌ ఎట్టకేలకు ప్రైమ్‌ గేమింగ్‌ సర్వీస్‌ను భారత్‌లో ప్రారంభించింది. అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్ర్కైబర్లు ఈ సర్వీస్‌ను ఉచితంగా పొందొచ్చని వెల్లడించింది. అందుకు అదనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించవల్సిన అవసరం లేదని తెల్పింది. దీంతో వీడియోలు, పీసీ గేమ్స్‌ను ఉచితంగా యాక్సెస్‌ చేసుకునేందుకు వినియోగదారులకు అనుమతి లభించింది. నిజానికి ఇతర దేశాల్లో చాలా ఏళ్లుగా ఈ సర్వీస్‌ అందుబాటులో ఉన్నప్పటికీ, భారత్‌లో మాత్రం ప్రారంభించింది అమెజాన్‌. ఈ గేమ్స్‌ను విండోస్‌ పీసీలో కూడా ఫ్రీగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

అమెజాన్ గేమింగ్ అనేది అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో అందించే కాంప్లిమెంటరీ సర్వీస్. సబ్‌స్ర్కైబర్లు గేమ్‌లోని కంటెంట్‌తో పాటు మొబైల్, విండోస్‌, మ్యాక్‌ గేమ్‌ కంటెంట్‌ను ప్రతి నెలా ఉచితంగా యాక్సెస్‌ చేసుకోవచ్చు. ప్రతీ నెల మరిన్ని గేమ్స్‌, కంటెంట్‌ను అందిస్తుంది. లీగ్ ఆఫ్ లెజెండ్స్, వాలరెంట్, డెత్‌లూప్, క్వేక్, సీఓడీ సీజన్ 1, ఈఏ మాడెన్ 23, ఫిఫా 23, అపెక్స్ లెజెండ్స్, డెస్టినీ 2, బ్రదర్స్: ఎ టేల్ ఆఫ్ టూ సన్స్.. వంటి ఎన్నో ఫేమస్‌ గేమ్‌లను అమెజాన్‌ ప్రైమ్‌ కస్టమర్లకు ప్రైమ్‌ గేమింగ్‌ ఉచితంగా అందిస్తోంది. డిసెంబర్‌ నెలకు సంబంధించి బ్యానర్స్‌ ఆఫ్‌ రుయిన్‌, డూర్స్‌: పారడాక్స్‌, డిజర్ట్‌ చైల్డ్‌, క్వేక్‌, స్పించ్‌.. తదితర గేమ్స్‌ను ఉచితంగా అందిస్తున్నారు.

ఈ గేమ్స్‌ ఆడాలంటే తొలుత అమెజాన్‌ ప్రైమ్‌ యూజర్లు అమెజాన్‌ గేమింగ్‌ వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేసి, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లాగిన్‌ వివరాలతో లాగిన్‌ అవ్వాలి. అలాగే అమెజాన్‌ గేమ్స్‌ యాప్‌ను కూడా డౌన్‌లోడ్‌ చేసుకుని గేమ్స్‌ ఆడవచ్చు. ఇప్పటి వరకు ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ లేకపోతే ఒక నెలకైతే రూ.179, మూడు నెలలకు రూ.459, ఏడాదికి రూ.1499లతో ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవచ్చు. ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నవాళ్లు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, అమెజాన్‌ ప్రైమ్ మ్యూజిక్‌, అమెజాన్‌ ఇ-కామర్స్‌లో ఫ్రీ డెలివరీలు వంటి ఎన్నో సేవలు పొందుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా బిజినెస్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.