China: ఒణుకు పుట్టిస్తోన్న వీడియో.. చైనా ఆసుపత్రుల్లో కుప్పలు తెప్పలుగా కోవిడ్‌ మృత దేహాలు.. వచ్చే 3 నెలల్లో లక్షల్లో మరణాలు

చైనాలోని వివిధ నగరాల్లో సమాధుల వద్ద రద్దీ నెలకొంది. వచ్చే మూడు నెలల్లో ఆ దేశం మొత్తం జనాభాలో 60 శాతం మందికి పైగా వైరస్‌ బారిన పడే అవకాశం ఉందని, లక్షల్లో మరణాలు సంభవిస్తాయని..

China: ఒణుకు పుట్టిస్తోన్న వీడియో.. చైనా ఆసుపత్రుల్లో కుప్పలు తెప్పలుగా కోవిడ్‌ మృత దేహాలు.. వచ్చే 3 నెలల్లో లక్షల్లో మరణాలు
Corona In China
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 20, 2022 | 12:45 PM

కొవిడ్ మహమ్మారి నుంచి యావత్‌ ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఐతే చైనాలో మళ్లీ కరోనా మరణమృదంగం మోగిస్తోంది. తాజాగా అక్కడ జీరో-కొవిడ్ నిబంధనలను సడలించిన తర్వాత నుంచి కరోనా కేసులు తీవ్రతరం అయ్యాయి. ఇప్పటికే చైనాలోని వివిధ నగరాల్లో సమాధుల వద్ద రద్దీ నెలకొంది. వచ్చే మూడు నెలల్లో ఆ దేశం మొత్తం జనాభాలో 60 శాతం మందికి పైగా వైరస్‌ బారిన పడే అవకాశం ఉందని, లక్షల్లో మరణాలు సంభవిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆ దేశ పరిస్థితి అదుపుతప్పుతోంది. వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండడంతో చైనా ఆసుపత్రులు కిక్కిరిసిపోయినట్లు ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్‌ ఫీగెల్‌ డింగ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. రానున్న 90 రోజుల్లో చైనాలో 60శాతం మందికి పైగా, ప్రపంచ జనాభాలో 10 శాతానికి పైగా కరోనా బారిన పడే ప్రమాదముందని ఆయన అన్నారు. మిలియన్ల మరణాలు సంభవించే అవకాశం ఉన్నట్లు, కేవలం ఆరంభం మాత్రమే అని ఎరిక్ తన ట్వీటర్ పోస్ట్‌లో తెలిపారు. చైనాలోని ఓ ఆసపత్రిలో రోగులతో నిండిపోయి ఉన్న వీడియోను కూడా ఆయన తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు.

బీజింగ్‌లో సోమవారం రెండే మరణాలు సంభవించాయన మీడియా సంస్థలు తెల్పుతున్నాయి. ఐతే కేవలం రోజుల వ్యవధిలోనే బీజింగ్‌లో దాదాపు 2700ల మంది మృతిచెందినట్లు, రోజుకు సగటున 200ల మృతదేహాలు స్మశాన వాటికలకు చేరుతున్నట్లు హాంకాంగ్‌ మీడియా కథనాలు తెల్పుతున్నాయి. దీనిని బట్టి చైనా వాస్తవమైన కోవిడ్‌ మృతుల సంఖ్యను బయటికి రానివ్వడంలేదని ఎరిక్‌ అన్నారు. రోజురోజుకీ మార్పు చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్లను కోవిడ్‌ వ్యాక్సిన్లు అడ్డుకోలేకపోతున్నాయని ఆయన అన్నారు. మరోవైపు నవంబర్ 23 నుంచి జీరో కోవిడ్‌ నిబంధనలను సండలించినప్పటి నుంచి బీజింగ్‌లో కోవిడ్ మరణాల సంఖ్యను చైనా నివేదించడం లేదు. ప్రస్తుతం ఎరిక్‌ ట్వీట్‌ యాతవ్‌ ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!