Cat Bite: పెంపుడు పిల్లి కాటుతో మంచానపడ్డ వ్యక్తి.. 15 ఆపరేషన్లు చేసినా ప్రాణం దక్కలేదు..

ఆ తర్వాత క్రమంగా వేలు నొప్పి కనిపించింది. అప్పుడు హెన్రిక్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందాడు. అయినప్పటికీ, నొప్పి తగ్గలేదు. అనేక ఇతర సమస్యలు కనిపించడం ప్రారంభించాయి. ఆ తర్వాత ఆసుపత్రిలో చేరారు.

Cat Bite: పెంపుడు పిల్లి కాటుతో మంచానపడ్డ వ్యక్తి.. 15 ఆపరేషన్లు చేసినా ప్రాణం దక్కలేదు..
Cat Bite
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 20, 2022 | 5:42 PM

కుక్క మాత్రమే కాదు, పిల్లి కాటుకు కూడా సమయానికి చికిత్స చేయాలి. హ..పిల్లి కదా..! కరిస్తే ఏమవుతుందిలే అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. అది ప్రాణాలకే ప్రమాదం. పిల్లి కాటుకు ఆదిలోనే వైద్యం అందక 33 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. అది కూడా పిల్లి కాటుకు గురైన నాలుగేళ్ల తర్వాత ఆ వ్యక్తి మృత్యువుబారినపడ్డాడు. ఇది మీకు ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ డెన్మార్క్‌లో జరిగిన ఈ సంఘటన మాత్రం నిజమే. పిల్లి కాటుకు గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. నాలుగేళ్ల క్రితం పిల్లి కాటుకు గురైన ఓ వ్యక్తికి అవసరమైన అన్ని చికిత్సలు అందించినా బతకలేదు. 33 ఏళ్ల హెన్రిక్ పిల్లి కాటుతో మరణించిన సంఘటన డెన్మార్క్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

డెన్మార్క్‌ నగరానికి చెందిన హెన్రిచ్‌ అనే 33ఏళ్ల వ్యక్తి ఇంట్లో పిల్లిని పెంచుకుంటున్నాడు. దానికి ఆండ్రీ అని పెట్టుకున్నాడు. సుమారు నాలుగు సంవత్సరాల క్రితం 2018లో హెన్రిచ్ ఇంట్లో ఉంచిన పిల్లి అతడి వేలిని కొరికింది. మొదట్లో పిల్లి కాటుకు ఎలాంటి చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేశారు. ఆ తర్వాత క్రమంగా వేలు నొప్పి కనిపించింది. అప్పుడు హెన్రిక్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందాడు. అయినప్పటికీ, నొప్పి తగ్గలేదు. అనేక ఇతర సమస్యలు కనిపించడం ప్రారంభించాయి. ఆ తర్వాత ఆసుపత్రిలో చేరారు. మెల్లగా ఆ వేలికి మరిన్ని సమస్యలు మొదలయ్యాయి. చివరికి పాడైపోయిన వేలిని తొలగించాల్సి వచ్చింది. అయితే ఇంత జరిగినా విషం తగ్గలేదు. బదులుగా విషం హెన్రిచ్ శరీరం అంతటా వ్యాపించింది.

ఉబ్బిన వేలిని కత్తిరించిన తర్వాత అతని చేతి మొత్తం వాచిపోయింది. దీని కారణంగా నెల రోజుల పాటు ఆసుపత్రిలో ఉండి 15 ఆపరేషన్లు చేయాల్సి వచ్చింది. కానీ ప్రయోజనం లేకపోయింది. చివరగా, చికిత్స విఫలమైంది. పిల్లి కరిచిన నాలుగు సంవత్సరాల తరువాత అతడు మరణించాడు. హెన్రిచ్‌ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ బారిన పడ్డారని, క్రమంగా అతడి పరిస్థితి అదుపు తప్పిందని వైద్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

దీనిపై మృతుడి హెన్రిక్ తల్లి స్పందిస్తూ.. ఎంత చికిత్స చేసినా హెన్రిక్ ఆరోగ్యం క్షీణించడం మొదలైందన్నారు.. ఇమ్యునో డిఫిషియెన్సీ, న్యుమోనియా, మధుమేహంతో బాధపడ్డారు. పిల్లి కుడి సిరలోకి కరిచింది. గాటు లోతుగా పడింది. అప్పుడు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చింది. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రక్తం ద్వారా శరీరంలోకి ప్రవేశించింది. తర్వాత ఇన్‌ఫెక్షన్‌ శరీరమంతా వ్యాపించిందని తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!