AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dates Benefits In Winter: ఇలాంటి వ్యాధుల నుంచి బయటపడాలంటే.. చలికాలంలో ఖర్జూరాన్ని తప్పకుండా తినండి

తినడానికి ఎంతో రుచికరంగా ఉండే ఖర్జూరాలు అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఖర్జూరంలో ఫైబర్, ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

Dates Benefits In Winter: ఇలాంటి వ్యాధుల నుంచి బయటపడాలంటే.. చలికాలంలో ఖర్జూరాన్ని తప్పకుండా తినండి
Dates
Jyothi Gadda
|

Updated on: Dec 20, 2022 | 4:45 PM

Share

ఆయుర్వేదం ప్రకారం ఖర్జూరాన్ని ఆరోగ్య గని అంటారు. ఖర్జూరం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిన విషయమే. కానీ, చలికాలంలో ఖర్జూరం తింటే అనేక వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు అని మీకు తెలుసా? అవును, తినడానికి ఎంతో రుచికరంగా ఉండే ఖర్జూరాలు అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఖర్జూరంలో ఫైబర్, ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రాగి, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్‌, పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఇందులో ఉన్నాయి.

చలికాలంలో ప్రజలు వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. దీని వల్ల జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఖర్జూరం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు. వాస్తవానికి, ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దాని వినియోగం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఖర్జూరం తినడం వల్ల మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు రావు.

రక్తహీనత: ఖర్జూరం తినడం వల్ల రక్తహీనత నయమవుతుంది. రక్తహీనతతో బాధపడేవారికి 21 రోజులపాటు ఖర్జూరం తినడం మేలు చేస్తుంది. అంతేకాకుండా, బలహీనతను తొలగించడంలో ఖర్జూరాలు ప్రయోజనకరంగా ఉన్నాయని రుజువు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

కొలెస్ట్రాల్ నియంత్రణ: ఖర్జూరాలు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.

ఇన్ఫెక్షన్‌ను నివారిస్తుంది: ఖర్జూరాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి . ఇవి మన రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడతాయి. ఖర్జూరం తింటే రోగాలు శరీరానికి దూరంగా ఉంటాయి. చలికాలంలో ఖర్జూరం తినడం జలుబు, ఫ్లూ వంటి అంటు వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడడంలో సహాయపడుతుంది.

మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది: ఖర్జూరం మెదడులో ఫలకాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. మెదడు ఆరోగ్యంగా ఉండేలా పని చేస్తుంది. ఖర్జూరం తినడం వల్ల అల్జీమర్స్ వంటి వ్యాధులు తగ్గుతాయి. ఖర్జూరం తినడం మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు.

ఖర్జూరాన్ని తినడానికి అత్యంత ప్రయోజనకరమైన మార్గం ఏమిటి? ఖర్జూరాన్ని సాధారణంగా పచ్చిగా తింటారు. అయితే, మీరు దాని పూర్తి ఆరోగ్య ప్రయోజనాలను పొందాలనుకుంటే, ఖర్జూరాలను నీటిలో నానబెట్టడం లేదా వాటిని పాలలో ఉడకబెట్టడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని పాలలో వేసి మరిగించి తింటే జలుబు సంబంధిత వ్యాధులు దూరం అవుతాయి. నీటిలో నానబెట్టి తినడం వల్ల బరువు, షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి