Viral Video: కొడుకు చేసిన పనితో తండ్రికి నడ్డి విరిగింది.. షాకింగ్ వీడియో వైరల్..
వైరల్ వీడియోలో ఒక వ్యక్తి తన బిడ్డతో కలిసి స్కూటర్‌పై బయల్దేరాడు. అంతలోనే ఊహించని ఘటన చోటు చేసుకుంది. అక్కడ జరిగిన సీన్ మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. అదే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయటంతో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.
మహారాష్ట్ర: వివేక్ గుప్తా అనే జర్నలిస్ట్ తన ట్విట్టర్‌లో ఒక షాకింగ్ వీడియోను షేర్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది. వైరల్ వీడియోలో ఒక వ్యక్తి తన బిడ్డతో కలిసి స్కూటర్‌పై బయల్దేరాడు. అంతలోనే ఊహించని ఘటన చోటు చేసుకుంది. అక్కడ జరిగిన సీన్ మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. అదే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయటంతో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ ఘటన మహారాష్ట్రలోని సింధుదుర్గలో జరిగినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈ వీడియోలో ఓ ఇంటి ముందు స్కూటర్‌పై తండ్రి, తన బిడ్డతో కలిసి కూర్చుని ఉన్నారు. అతను ఏదో పనిపైన బయటకు వెళ్లేందుకు స్కూటర్‌పై తన బిడ్డను తీసుకుని బయల్దేరాడు. వీడియోలో వారి ఇంటిముందు నివాసం ముందు పార్క్ చేసిన స్కూటీని వీడియోలో చూడవచ్చు. అయితే, ఇంతలోనే ఇంటి లోపలి నుంచి ఒక మహిళ బయటకు వస్తూ ఏదో తెచ్చి అతనికి ఇచ్చేందుకు వస్తుంది. ఆ స్కూటీపై ముందు నిల్చొని ఉన్న బాలుడు యాక్సిలరేటర్ పట్టుకొని ఉన్నాడు. దీంతో ఒక్కసారిగా స్కూటీ ముందుకు కదిలింది. దీంతో స్కూటీ అదుపుతప్పడంతో బాలుడు కిందపడిపోగా, స్కూటీపై ఉన్న వ్యక్తి వెనక్కి ఎగిరిపడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
जब बच्चा स्कूटी पर हो तो, स्कूटी को रोकने के बाद उसका इंजन जरूर बंद करे..
नही तो यह घटना आपके साथ भी हो सकती है.
महाराष्ट्र के सिंददुर्घ की घटना..@News18India pic.twitter.com/VYrNeRnynQ
— Vivek Gupta (@imvivekgupta) December 19, 2022
స్కూటీపై ముందు నిలబడి ఉన్న కుర్రాడి చేసిన పనికి స్కూటర్ వెళ్లి ముందున్న స్తంభాన్ని ఢీకొట్టింది. ఇదంతా అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీలో నమోదు కావటంతో వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోను ప్రముఖ జర్నలిస్ట్ వివేక్ గుప్తా ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడిందని, తండ్రికి మాత్రం స్వల్ప గాయాలైనట్టుగా తెలిసింది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ పెడుతున్నారు. పిల్లవాడు స్కూటీపై ఉన్నప్పుడు, స్కూటీని ఆపిన తర్వాత, దాని ఇంజిన్ స్విచ్ ఆఫ్ చేయాలని పలువురు సూచిస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి