Ladakh hospital: లడక్‌లో అందుబాటులోకి హెలిప్యాడ్ ఆసుపత్రి.. కార్గిల్ నుండి విమానంలో రోగుల తరలింపు..
ఇది స్థానిక ప్రజలకు, వైద్య అధికారులకు, అడ్మినిస్ట్రేషన్‌కు పెద్ద ఉపశమనాన్ని కలిగిస్తుంది, ముఖ్యంగా శీతాకాలంలో మంచు కురవడం, తక్కువ రోజుల కారణంగా రోడ్లు మూసివేసినప్పుడు ఎంతో సహయకంగా ఉంటుందన్నారు.
లడఖ్ రాష్ట్రంలో హెలిప్యాడ్ కూడా ఉంది. ఇది కూడా కొత్తగా ప్రారంభించబడింది. మొదటిసారిగా రోగిని ఎయిర్‌లిఫ్ట్ చేశారు. ఈ హెలిప్యాడ్ నిర్మాణంతో లడఖ్‌లోని మారుమూల ప్రాంతాల మౌలిక సదుపాయాలు కూడా ఊపందుకున్నాయి. లడఖ్‌లోని కార్గిల్ జిల్లాలోని కుర్బాతంగ్‌లో ఈ హెలిప్యాడ్ ఆసుపత్రిని నిర్మించారు. లడఖ్‌లోని కార్గిల్ జిల్లాలోని కుర్బాతంగ్‌లో ఉన్న 300 పడకల ఆసుపత్రిలో కొత్త హెలిప్యాడ్ సోమవారం పూర్తి అందుబాటులోకి వచ్చిందని, శ్రీనగర్‌లోని ఆసుపత్రికి రోగిని విమానంలో తరలించడంలో సహాయపడిందని లడఖ్ యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్, కార్గిల్ జిల్లా అధికారులు తెలిపారు. దీంతో కుర్బతంగ్ హాస్పిటల్ లడఖ్‌లో క్యాంపస్ హెలికాప్టర్ తరలింపు ఎంపికను కలిగి ఉన్న మొదటి ఆసుపత్రిగా అవతరించింది. ఇది మారుమూల హిమాలయాల్లో ముఖ్యంగా లడఖ్‌లోని మంచుతో కప్పబడిన ప్రాంతాలలో ఆరోగ్య మౌలిక సదుపాయాలకు ప్రధాన వనరుగా పనిచేస్తుంది. ఆసుపత్రి ప్రాంగణం నుండి హెలికాప్టర్ ఎగురుతున్నట్లు కనిపించే వీడియోను కూడా అధికారులు ట్వీట్టర్‌లో షేర్ చేశారు.
ఈ విషయంపై దూరదర్శన్‌తో మాట్లాడిన నోడల్ ఆఫీసర్ మహ్మద్ హసన్, లడఖ్ అడ్మినిస్ట్రేషన్ ఆసుపత్రిలో హెలిప్యాడ్ కావాలని కోరుకుంటుందని, అక్కడ నుండి మేము ఎయిర్ అంబులెన్స్‌ను మోహరించవచ్చని చెప్పారు. ఆసుపత్రిలోనే హెలిప్యాడ్‌ను కోరుకున్నాము, తద్వారా అత్యవసర రోగులను సులభంగా తరలించి, మెరుగైన ఆరోగ్య సంరక్షణ అందించగల ఆసుపత్రికి తీసుకెళ్లవచ్చునని హసన్ చెప్పారు.
ఇది స్థానిక ప్రజలకు, వైద్య అధికారులకు, అడ్మినిస్ట్రేషన్‌కు పెద్ద ఉపశమనాన్ని కలిగిస్తుంది, ముఖ్యంగా శీతాకాలంలో మంచు కురవడం, తక్కువ రోజుల కారణంగా రోడ్లు మూసివేసినప్పుడు ఎంతో సహయకంగా ఉంటుందన్నారు. మునుపటి ఆసుపత్రి హెలిప్యాడ్ నుండి చాలా దూరంలో ఉందని, మంచు కారణంగా అత్యవసర తరలింపు కోసం అక్కడి నుండి హెలిప్యాడ్‌కు వెళ్లడానికి చాలా కష్టపడాల్సి వచ్చేదని హసన్ చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి