Viral Video: 1.5 లక్షల చిల్లర కాయిన్స్‌తో ఐఫోన్ కొనాలనుకున్న కుర్రాడు.. కానీ సీన్ రివైర్సయ్యింది
నాణేలన్నీ అతని ముందు ఒక సంచిలో, టబ్బులో, పాలిథిన్ కవర్‌లో పోసుకుని తెచ్చాడు. చిల్లరంతా ఇచ్చి మీకు కావాల్సిన 84,000 మొబైల్ బిల్లు తీసుకుని మిగిలిన డబ్బు తిరిగి ఇవ్వండి..అంటూ దుకణాదారుడిని కోరుతాడు. దాంతో సదరు వ్యాపారికి చిర్రెత్తిపోయింది.
రాజస్థాన్‌కు చెందిన ఓ బాలుడు నాణేలతో ఐఫోన్‌ను కొనుగోలు చేసేందుకు యాపిల్ స్టోర్‌కు వెళ్లాడు. అందుకోసం అతడు రూ1.5 లక్షల కంటే ఎక్కువ నాణేలతో ఐఫోన్ 14 కొనడానికి వెళ్లాడు. అంత పెద్ద మొత్తంలో చిల్లర నాణేలు చూసిన దుకాణదారుడు కంగుతిన్నాడు. చిల్లర తీసుకునేందుకు నిరాకరించటంతో దుకాణదారుడితో ఆ యువకుడు వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే స్టోర్ లోపల నాణేలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆ అబ్బాయి పేరు అమిత్ శర్మ. వీడియో ఆధారంగా అతడు ఆపిల్ స్టోర్ నుండి ఐఫోన్ 14 కొనుగోలు చేసేందుకు వచ్చాడు. అయితే,ఫోన్ సెలక్షన్ అయిపోయిన తర్వాత దుకాణదారుడు నగదు చెల్లించమని అడిగినప్పుడు, తను తీసుకొచ్చిన నాణేల మూఠను విప్పుతాడు. ఇది చూసి అక్కడున్న జనం ఆశ్చర్యపోయారు. నాణేల లెక్కింపు విషయంలో దుకాణదారునికి, వినియోగదారుడికి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో, అమిత్, అతని స్నేహితులు నాణేలను నేలపై పోశారు. నాణేలన్నీ అతని ముందు ఒక సంచిలో, టబ్బులో, పాలిథిన్ కవర్‌లో పోసుకుని తెచ్చాడు. చిల్లరంతా ఇచ్చి మీకు కావాల్సిన 84,000 మొబైల్ బిల్లు తీసుకుని మిగిలిన డబ్బు తిరిగి ఇవ్వండి..అంటూ దుకణాదారుడిని కోరుతాడు. దాంతో సదరు వ్యాపారికి చిర్రెత్తిపోయింది. ఇన్ని నాణేలను ఎవరు లెక్కిస్తారని ఆగ్రహానికి గురయ్యాడు. ఆపై నాణేలను లెక్కించడంపై ఇరువురి మధ్య వాగ్వాదం మొదలైంది. దీంతో ఈ గొడవ కాస్త పోలీస్ స్టేషన్ చేరింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి పూర్తి చేసేంత వరకు వ్యవహారం వచ్చింది. అయితే చివరకు ఆన్ లైన్ లో చెల్లించి అమిత్ మొబైల్ తీసుకున్నాడు.
అయితే, ఇంతకీ ఎవరీ అమిత్ అన్న విషయానికి అమిత్ ఒక యూట్యూబర్, అతనికి క్రేజీ XYZ అనే యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఈ ఛానెల్‌లో అతను నాణేలతో ఐఫోన్‌ను కొనుగోలు చేస్తున్న వీడియోను అప్‌లోడ్ చేశాడు. రెండు రోజుల్లోనే ఈ వీడియోకు 35 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వీడియో ప్రారంభంలో, అమిత్ తన స్నేహితులతో చాలా నాణేలు పట్టుకుని కనిపిస్తాడు. వివాదం అనంతరం.. సరదాగా మాట్లాడుతూ.. దుకాణదారుడికి ఇబ్బంది కలిగించకూడదనేది అతని లక్ష్యం. అమిత్ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి