Viral: ల్యాప్‌టాప్ ఆర్డర్ పెట్టిన మహిళకు ఊహించని షాక్.. దాదాపు లక్షన్నర ఖరీదైన..
ఈ ప్యాకెట్‌ని తెరిచి చూసిన వారు ఆశ్చర్యపోయారు.. వారు వెంటనే దాని గురించి కంపెనీకి ఫిర్యాదు చేశారు. కానీ, కంపెనీ దానిని వాపసు చేయడానికి నిరాకరించింది. కానీ,
ప్రస్తుత కాలంలో ప్రతి చిన్న వస్తువుకోసం ప్రజలు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారు. కరివేపాకు, పచ్చి మిర్చి నుండి ఖరీదైన మొబైల్స్, ల్యాప్‌టాప్‌లను కూడా ఇంట్లోంచి అడుగు బయటపెట్టకుండానే కొనుగోలు చేసేస్తున్నారు. అయితే, పలు సందర్భాల్లో ఆన్ లైన్ షాపింగ్‌లో మోసాలు జరిగిన సంఘటనలు కూడా వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా అలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక వ్యక్తి తన కుమార్తె కోసం ల్యాప్‌టాప్‌ను ఆర్డర్ చేసాడు. కానీ, ఆన్‌లైన్‌లో వచ్చిన ఆర్డర్ చూసి వారి ఇంటిల్లిపాది కంగుతిన్నారు. ల్యాప్‌ట్యాప్‌కు బదులుగా వారికి మరోకటి అందింది. దాంతో వారు కస్టమర్ కేర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. కానీ, కంపెనీ అందుకు వాపసు ఇవ్వడానికి నిరాకరించిందని తెలిసింది. ఇంతకీ వారికి అందిన వస్తువు ఏంటి..? ఆ తరువాత ఏం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం..
ఒక వ్యక్తి తన కుమార్తె కోసం అమెజాన్ నుండి Apple MacBook Pro ల్యాప్‌టాప్‌ను ఆర్డర్ చేసాడు. దీని ఖరీదు లక్ష రూపాయలకు పైగానే ఉంది. అయితే కంపెనీ ల్యాప్‌టాప్‌కు బదులుగా అలాన్ వుడ్‌కు రెండు కుక్క ఫుడ్ ప్యాకెట్లను పంపింది. ఈ ప్యాకెట్‌ని తెరిచి చూసిన వారు ఆశ్చర్యపోయారు.. వారు వెంటనే దాని గురించి కంపెనీకి ఫిర్యాదు చేశారు. కానీ, కంపెనీ దానిని వాపసు చేయడానికి నిరాకరించింది. కానీ, తరువాత కంపెనీ చెల్లింపును అలెన్‌కు తిరిగి ఇచ్చింది.
తాను గత 20 సంవత్సరాలుగా అమెజాన్ నుండి వస్తువులను ఆర్డర్ చేస్తున్నానని, ఇప్పటి వరకు తనకు ఎటువంటి సమస్య రాలేదని చెప్పారు. అయితే ఈసారి అతను సమస్యను ఎదుర్కోవలసి వచ్చిందని అలాన్ చెప్పాడు. అయితే, కంపెనీ ఈ విషయాన్ని గుర్తించింది. కంపెనీ అలెన్‌కు క్షమాపణలు కూడా చెప్పింది. ఆ తర్వాత ఖరీదు నగదును అతనికి తిరిగి చెల్లించింది. ఒక రకంగా చెప్పాలంటే అలాన్‌కి చెల్లింపు తిరిగి రావడం అదృష్టమని చెప్పవచ్చు. చెప్పాలి. భారతదేశంలో చాలా మందికి బంగాళాదుంపలు, ఉల్లిపాయలు ఆర్డర్ వస్తుంటాయి. చాలా సందర్భాలలో ఫిర్యాదుల తర్వాత కూడా వినియోగదారుల సమస్యలు తీరని ఘటనలు కూడా అనేకం ఉన్నాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి