AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T.Congress: నిట్టనిలువునా చీలిన టి-కాంగ్రెస్‌పై హైకమాండ్‌ ఫోకస్‌.. ఏఐసీసీ సెక్రటరీ నదీమ్‌కు ప్రియాంకగాంధీ ఫోన్..

ఇంటిపోరు ఇంతింత కాదయా అన్నట్టు సాగుతోన్న టీకాంగ్రెస్ వర్గ పోరు.. ఇప్పటికే నెక్స్ట్ లెవల్ కి చేరిపోయింది. అయితే తాజాగా ఈ రచ్చపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ దృష్టి పెట్టారు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలను అడిగి తెలుసుకున్నారు.

T.Congress: నిట్టనిలువునా చీలిన టి-కాంగ్రెస్‌పై హైకమాండ్‌ ఫోకస్‌.. ఏఐసీసీ సెక్రటరీ నదీమ్‌కు ప్రియాంకగాంధీ ఫోన్..
Priyanka Gandhi
Sanjay Kasula
|

Updated on: Dec 19, 2022 | 3:51 PM

Share

తెలంగాణ కాంగ్రెస్‌లో సంక్షోభంపై అధిష్టానం దృష్టి సారించింది. ఏఐసీసీ సెక్రటరీ నదీమ్‌కు ఫోన్ చేశారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా. జరుగుతున్న పరిణామాలను అడిగి తెలుసుకున్నారామె. కొత్త కమిటీల్లో అన్యాయం జరిగిందని భావిస్తున్న సీనియర్లతో త్వరలో ప్రియాంక భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏఐసీసీ సెక్రటరీ నదీమ్‌ ఇప్పటికే ఓ రిపోర్ట్‌ను మాణిక్కం ఠాకూర్‌కి అందించారు. దీంతో రంగంలోకి దిగిన హైకమాండ్‌.. అసంతృప్త నేతలతో వెంటనే భేటీ కావాలని పార్టీ కార్యదర్శులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. లేటెస్ట్‌గా ప్రియాంక గాంధీ.. నదీమ్‌కు కాల్‌ చేసి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నట్లుగా సమాచారం.

ఆ తర్వాత ఏం జరగనుంది? కాంగ్రెస్ ఒరిజినల్ వర్సెస్ వలస లీడర్ల.. యాక్టివిటీస్ ఎలా ఉండబోతున్నాయ్..? ముందుగా నిన్న జరిగిన పరిణామాలేంటి..? అనే అంశాలతపోటు.. రేవంత్ రెడ్డి చేపట్టనున్న “యాత్ర”పై కూడా వివరాలు అడిగినట్లుగా సమాచారం.

ఆదివారం కాంగ్రెస్‌ పార్టీలో ఏం జరిగిందంటే..

ఆదివారం హైదరాబాద్‌ ఇందిరాభవన్‌లో టీ.పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఎగ్జిక్యూటీవ్ సమావేశానికి సీనియర్‌ నేతలు ఎవ్వరూ హాజరు కాకపోవడం టి.కాంగ్రెస్‌లో కలకలం రేపింది. సమావేశానికి వచ్చే ప్రశ్నేలేదని సీనియర్లు భీష్మించుకుని కూర్చోవడంతో రేవంత్‌వర్గం నేతలు 13 మంది తమ పదవులకు రాజీనామా చేశారు. వారిలో వేం నరేందర్ రెడ్డి, సీతక్క, విజయ రమణారావు, చారగొండ, వెంకటేష్, ఎర్ర శేఖర్‌ ఉన్నారు. పదవులు తమకు ముఖ్యంకాదని వారంతా స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తి గళం తార స్థాయికి చేరిన వేళ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎల్పీ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడితో సహా పలువురు సీనియర్‌ నాయకులు రేవంత్‌పై చేసిన విమర్శలను ఆయన వర్గీయులు తిప్పికొట్టారు. కాంగ్రెస్‌ పార్టీని, రేవంత్‌రెడ్డిని బలహీనపర్చే కుట్ర జరుగుతోందన్నారు మాజీ ఎమ్మెల్యే అనిల్‌.

అటు సీనియర్లు రేవంత్‌ మీటింగ్‌కు హాజరుకాకపోవడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ స్పందించారు. ఒరిజినల్‌ కాంగ్రెస్‌ నేతలకు అన్యాయం జరగొద్దనేదే తమ ఉద్దేశ్యమన్నారు వీహెచ్‌. తెలంగాణ కాంగ్రెస్‌లో ఓవైపు రచ్చ కొనసాగుతుండగానే, మరోవైపు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం మూడు గంటలపాటు హాట్‌హాట్‌గా కొనసాగింది. సమావేశంలో జనవరి 26 నుంచి జరిగే రేవంత్‌రెడ్డి యాత్రపై చర్చ జరిగింది. దాంతోపాటు సమావేశానికి హాజరుకానీ సీనియర్‌ నేతలపై ఏఐసీసీకి ఫిర్యాదు చేయాలని టి.పీసీసీ భావిస్తోంది.

తొలుత సమావేశంలో గందగోళం ఏర్పడగా… రేవంత్‌రెడ్డి పరిస్థితిని చక్కదిద్దారు.గొడవలు వద్దని, సమావేశానికి సంబంధించినవి తప్ప ఇతర విషయాలు మాట్లాడ వద్దని విజ్ఞప్తి చేశారు. ఎజెండాకు లోబడే మాట్లాడాలని, అందరూ ఓపికపట్టాలని రేవంత్‌ కోరారు. పార్టీలో ఏవైనా సమస్యలుంటే అధిష్ఠానం పరిష్కరిస్తుందని రేవంత్‌రెడ్డి చెప్పారు.

మొత్తానికి ముదిరి పాకానపడ్డ తెలంగాణ కాంగ్రెస్‌ సంక్షోభానికి హైకమాండ్‌ ఎలా ఫుల్‌స్టాప్‌ పెట్టబోతుందన్నది బిగ్‌ టాస్క్‌గా కనిపిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం