AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dogs Chasing Bike: ఈ ట్రిక్ పాటిస్తే కుక్కలు మీ బైక్ వెనుక ఎప్పటికీ పరుగెత్తవు.. ఏం చేయాలంటే..

ఇలాంటి సంఘటన మీకు కూడా జరిగి ఉంటుంది. మీరు బైక్‌పై వేగంగా వెళ్తున్నప్పుడు కుక్కలు వెంబడించడం .. దీంతో మీరు మరింత వేగంగా పెంచడం జరిగి ఉంటుంది. అయితే మీకు ఎదురుగా కుక్క కనిపిస్తే ఏం చేయాలో తెలుసుకోండి.

Dogs Chasing Bike: ఈ ట్రిక్ పాటిస్తే కుక్కలు మీ బైక్ వెనుక ఎప్పటికీ పరుగెత్తవు.. ఏం చేయాలంటే..
Dogs Chasing Bike
Sanjay Kasula
|

Updated on: Dec 15, 2022 | 6:04 PM

Share

మన దేశంలో ద్విచక్ర వాహనదారుల సంఖ్య చాలా ఎక్కువ. ప్రతి చిన్న పనికి మనం టూవీలర్ ఉపయోగిస్తుంటాం. అయితే కొన్ని సార్లు విచిత్రమైన పరిస్థితి ఎదుక్కొవల్సి వస్తుంది. మనం వేగంగా ఏదో పనిపై వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా అరుస్తూ మన వెంట పడుతుంటాయి గ్రామసింహాలు. అందులో రాత్రిపూట బైక్‌లో ప్రయాణిస్తున్నప్పుడు కొన్నిసార్లు కుక్కలు బైక్‌ను వెంబడించడం మొదులు పెడుతాయి. మీరు ఎప్పుడో ఒకసారి అనుభవించి ఉండాలి. ఇలాంటి ఘటనలు మనలో చాలా మందికి జరిగి ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో బైక్‌ను మరింత వేగంగా నడిపి ప్రమాదాలకు గురైన సంఘటనలు చాలా కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో కుక్కలు ఎందుకు మొరుగుతాయో మనకు అర్థం కాదు. ఎలా తప్పించుకోవాలో కూడా తెలియదు.

అయితే, కుక్కలు మొరగడానికి చాలా కారణాలు ఉండవచ్చు. అందుకే, ప్రస్తుతానికి ఈ ప్రశ్నకు దూరంగా ఉండి.. ఈరోజు మనం చెప్పబోయే దాన్ని నివారించే మార్గం ఏంటో నేరుగా దృష్టి సారిద్దాం. నిజానికి, మీరు రాత్రిపూట బైక్ లేదా స్కూటర్‌పై కుక్కల మధ్యగా వెళుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మీరు ప్రయాణిస్తున్నప్పుడు మాత్రమే అవి వెంబడించడాన్ని గమనించి ఉంటారు. కానీ, అలా వెంబడించకూడదని అనుకుంటే మీరు కొన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి.

  • మొదటి విషయం ఏంటంటే.. మీరు మోటార్‌సైకిల్‌ను వేగంగా నడకండి.
  • కుక్కలు కూర్చున్న ప్రదేశానికి సమీపంలో నెమ్మదిగా వెళ్లండి.
  • మీరు అధిక వేగంతో ఉన్నప్పటికీ వాటి సమీపంలో మీ బైక్‌ను వేగాన్ని తగ్గించండి.
  • అప్పుడు కూడా కుక్క మిమ్మల్ని వెంబడించడానికి వచ్చినా లేదా మొరిగినా.. ఒకసారి బైక్‌ను ఆపి, మళ్లీ నెమ్మదిగా అక్కడి నుంచి దూరంగా వెళ్లండి.
  • మరోవైపు ఈ సమయంలో బైక్‌ను వేగంగా నడిపితే కుక్కలు ఎక్కువగా వెంటాడతాయి.
  • ఒకే చోటు రెండు కంటే ఎక్కవ కుక్కలు ఉంటే వాటి మధ్యలో నుంచి కాకుండా మరో పక్క నుంచి వెళ్లండి.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం