Girl Sale Blood: స్మార్ట్ ఫోన్ కొనేందుకు తన రక్తం అమ్మకానికి పెట్టిన మైనర్ బాలిక..! చివరికి ఏమైంది అంటే..

Girl Sale Blood: స్మార్ట్ ఫోన్ కొనేందుకు తన రక్తం అమ్మకానికి పెట్టిన మైనర్ బాలిక..! చివరికి ఏమైంది అంటే..

Anil kumar poka

|

Updated on: Dec 15, 2022 | 9:33 PM

మనలో చాలా మంది మంచి ఫీచర్స్ ఉన్న, ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ చేతిలో ఉండాలని కోరుకుంటారు. కొంచెం కష్టమైనా సరే.. మంచి ఫోన్ కొనాలనుకుంటారు. అయితే, బెంగాల్‌లోని దినాజ్‌పూర్‌కు చెందిన 16 ఏళ్ల అమ్మాయి స్మార్ట్ ఫోన్ కొనేందుకు ఏకంగా తన రక్తాన్ని అమ్మేందుకు ప్రయత్నించింది.


12వ తరగతి చదువుతున్న సదరు యువతి ఆన్‌లైన్‌లో 9 వేల రూపాయల విలువైన స్మార్ట్‌ఫోన్‌ను ఆర్డర్ చేసింది. నాలుగు రోజుల్లో ఫోన్ డెలివరీ అవ్వాల్సి ఉండగా.. అంత డబ్బు సమకూర్చుకోవడం తనకు కష్టమైంది. దీంతో ఆ యువతి బలూర్‌ఘాట్‌లోని జిల్లా ఆసుపత్రిలో తన రక్తాన్ని డబ్బులకు విక్రయించాలనుకుంది. ట్యూషన్‌కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి ఆసుపత్రికి చేరుకుంది. బ్లడ్ సెంటర్‌కి వెళ్లి రక్తం ఇస్తాను డబ్బులు కావాలని చెప్పడంలో సిబ్బంది షాకయ్యారు. అనుమానం వచ్చిన బ్లడ్ సెంటర్ సిబ్బంది శిశు సంక్షేమ అధికారులకు సమాచారం ఇచ్చారు. అసలు విషయం తెలిసి, ఆమెను మందలించిన సిబ్బంది.. జిల్లా శిశు సంక్షేమ కమిటీ సహకారంతో యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.

Published on: Dec 15, 2022 09:01 PM