AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eggs in Refrigerator: గుడ్లను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? బీకేర్ ఫుల్.. చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది..

మార్కెట్ నుంచి గుడ్లు తెచ్చి ఫ్రిజ్‌లో పెట్టడం మామూలే. కానీ.. అలా చేయడం వల్ల అనారోగ్యాన్ని ఏరికోరి తెచ్చుకున్నట్లే అవుతుంది. అందుకే.. గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టాలా? వద్దా? అనే అంశంపై అందరూ సందేహంలో ఉంటారు.

Eggs in Refrigerator: గుడ్లను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? బీకేర్ ఫుల్.. చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది..
Egg
Shiva Prajapati
|

Updated on: Dec 15, 2022 | 4:44 PM

Share

మార్కెట్ నుంచి గుడ్లు తెచ్చి ఫ్రిజ్‌లో పెట్టడం మామూలే. కానీ.. అలా చేయడం వల్ల అనారోగ్యాన్ని ఏరికోరి తెచ్చుకున్నట్లే అవుతుంది. అందుకే.. గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టాలా? వద్దా? అనే అంశంపై అందరూ సందేహంలో ఉంటారు. అయితే, చాలా వరకు గుడ్లను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచాలని సలహా ఇస్తుంటారు నిపుణులు. గుడ్లను ఫ్రిజ్‌లో పెడితే మరింత ప్రమాదమే తప్ప.. ఉపయోగం లేదంటున్నారు. మరి గుడ్లను ఎందుకు ఫ్రిజ్‌లో పెట్టకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గుడ్లు ఎందుకు ఫ్రిజ్‌లో పెట్టకూడదు?

గుడ్డులో కాల్షియం, ప్రొటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుడ్డులో పోషకాలు, సేంద్రీయ సమ్మేళనాలు సమృద్ధిగా ఉండటం వల్ల అది చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగానే ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల గుడ్లు పాడైపోతాయని అనేక పరిశోధనల్లో వెల్లడైంది.

గది ఉష్ణోగ్రత వద్ద గుడ్లు ఉంచడానికి కారణాలు..

మీరు సాధారణ గది ఉష్ణోగ్రతలో గుడ్లు ఉంచినట్లయితే అవి చాలా రోజులు నిల్వ ఉంటాయి. వాటిని తినొచ్చు. అయితే, గుడ్లు కొనుగోలు చేసిన వెంటనే వాటిని తినమని చాలా మంది సలహా ఇస్తారు. అదే సమయంలో గది ఉష్ణోగ్రత వద్ద ఉంచినా.. ఆ గుడ్లు కుళ్లిపోకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

వైరస్ సోకే ప్రమాదం..

గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల. సాల్మొనెల్లా అనే వైరస్ సోకే ప్రమాదం ఉంది. ఇది కడుపు నొప్పి, వికారం వంటి సమస్యలను కలిగిస్తుంది. అందుకే, వాటిని తెచ్చిన వెంటనే తినాలని సూచిస్తారు నిపుణులు.

ఫ్రిజ్‌లో పెడితే పాడైపోతాయి..

కొన్ని దేశాల్లో గుడ్లతో వంటకాలు చేసిన తరువాత.. వాటిని ఫ్రిజ్‌లో పెడుతుంటారు. అలా చేయడం వల్ల బ్యాక్టీరియా చేరదని, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని చెబుతారు. కానీ, అదంతా వట్టిదే అంటున్నారు నిపుణులు. ఎక్కువ రోజులు గుడ్లతో చేసిన వంటకాలను నిల్వ ఉంచితే.. బ్యాక్టీరియా చేరుతుందని, తద్వారా అవి పాడైపోతాయని స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ రీసెంట్ గ్యాంబ్లింగ్ యాక్షన్ థ్రిల్లర్
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ రీసెంట్ గ్యాంబ్లింగ్ యాక్షన్ థ్రిల్లర్
అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. టాలీవుడ్ విలన్..
అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. టాలీవుడ్ విలన్..
పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే..
పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే..
ఈ రాశి వారికి నవరాత్రి ఉత్సవాలు వరం.. బంగారం లాంటి భవిష్యత్తు
ఈ రాశి వారికి నవరాత్రి ఉత్సవాలు వరం.. బంగారం లాంటి భవిష్యత్తు
శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..
శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..
బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్
బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్
చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం
5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం
అప్పుడే ఆమెకు పడిపోయా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ మూములుగా లేదుగా
అప్పుడే ఆమెకు పడిపోయా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ మూములుగా లేదుగా